ITR filing last date : ఐటీఆర్​ ఫైలింగ్​కు నేడే లాస్ట్​ డేట్​.. ఇప్పటివరకు 6.13కోట్ల రిటర్నులు దాఖలు!-over 6 13 crore itrs filed for 2022 23 fiscal last date today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Itr Filing Last Date : ఐటీఆర్​ ఫైలింగ్​కు నేడే లాస్ట్​ డేట్​.. ఇప్పటివరకు 6.13కోట్ల రిటర్నులు దాఖలు!

ITR filing last date : ఐటీఆర్​ ఫైలింగ్​కు నేడే లాస్ట్​ డేట్​.. ఇప్పటివరకు 6.13కోట్ల రిటర్నులు దాఖలు!

Sharath Chitturi HT Telugu
Jul 31, 2023 03:24 PM IST

ITR filing last date : ఇప్పటివరకు 6.13కోట్లకుపైగా ఐటీఆర్​లు ఫైల్​ అయ్యాయి. నేటి రాత్రితో గడువు ముగియనుంది.

ఐటీఆర్​ ఫైలింగ్​కు నేడే లాస్ట్​ డేట్​..
ఐటీఆర్​ ఫైలింగ్​కు నేడే లాస్ట్​ డేట్​.. (MINT_PRINT)

ITR filing last date : ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువు నేటితో ముగియనుంది. వేతన జీవులు తమ ఐటీఆర్​ను నేటి రాత్రిలోపు ఫైల్​ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఇప్పటివరకు 6.13కోట్లకుపైగా ఐటీఆర్​లు ఫైల్​ అయినట్టు ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది.

"ఆదివారం వరకు 6.13కోట్ల ఐటీఆర్​లు ఫైల్​ అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నాటికి మరో 11.03లక్షల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి," అని ఐటీశాఖ ట్వీట్​ చేసింది.

తుది గడువును పొడిగిస్తారా..?

గతేడాది.. జులై 31 నాటికి మొత్తం మీద 5.83కోట్ల ఇన్​కమ్​ ట్యాక్స్​ రిటర్నులు ఫైల్​ అయ్యాయి. ఈసారి.. ఈ నెంబర్​ రెండు, మూడు రోజుల క్రితమే దాటిపోయింది.

ITR filing 2023 : "ఈ మైలురాయిని అధిగమించడంలో సాయం చేసిన పన్నుచెల్లింపుదారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సహాయ సహకారమే కీలకం," అని ఐటీశాఖ ట్వీట్​లో పేర్కొంది.

ఇదీ చూడండి:- ITR refund status check : ఐటీఆర్​ రీఫండ్​ స్టేటస్​ ఎలా చెక్​ చేసుకోవాలి?

చివరి నిమిషం వరకు వెయిట్​ చేయవద్దని, తొందరగా ఐటీఆర్​ ఫైలింగ్​ చేయాలని ఐటీశాఖ చెబుతూ వస్తోంది. ఐటీఆర్​ ఫైలింగ్​లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా, లేదా సాయం కావాలన్నా.. orm@cpc.incometax.gov.in లో కనెక్ట్​ అవ్వాలని వెల్లడించింది. 

ITR filing deadline extension : మరోవైపు.. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు తుది గడువును పొడిగించే యోచనలో ప్రభుత్వం లేదని ఐటీశాఖ స్పష్టం చేసింది. అయితే.. చాలా మంది తుది గడువులోపు తాము ఫైల్​ చేయలేమని అభిప్రాయపడుతున్నట్టు పలు సర్వేలు చెప్పాయి.

తుది గడువు పూర్తైన తర్వాత కూడా ఫైల్​ చేసే ఆప్షన్​ ఉన్నప్పటికీ.. జరిమానా పడుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది డిసెంబర్​ 31లోపు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్​ చేస్తే.. రూ. 5వేల జరిమానాతో వాటిని స్వీకరిస్తారు. అదే డిసెంబర్​ 31 తర్వాత ఫైల్​ చేస్తుంటే.. రూ. 10వేల వరకు ఫైన్​ పడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం