EPFO NEWS: ‘క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం ఈ ఈపీఎఫ్ఓ చందాదారులకు ఆధార్ సీడింగ్ అవసరం లేదు’
EPFO NEWS: సాధారణంగా ఈపీఎఫ్ఓ చందాదారులు క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం తమ యూఏఎన్ (Universal Account Number)ను ఆధార్ కు అనుసంధానం చేసుకొని ఉండాలి. కాని, కొన్ని కేటగిరీల ఉద్యోగులకు క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం యూఏఎన్ తో ఆధార్ సీడింగ్ అవసరం లేదు. ఆ కేటగిరీల ఉద్యోగులు ఎవరో ఇక్కడ చూద్దాం.
EPFO NEWS: కొన్ని కేటగిరీల ఉద్యోగులు తమ ఫిజికల్ క్లెయిమ్ లను సెటిల్ చేయడానికి ఆధార్ ను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రకటించింది. క్లెయిమ్ ల సెటిల్మెంట్ కోసం ఈపీఎఫ్ఓ చందాదారులు తమ యూఏఎన్ (Universal Account Number)ను ఆధార్ తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే, తాజా నోటిఫికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓ ఈ విధానంలో కొన్ని మార్పులు చేసింది. కొన్ని కేటగిరీల ఉద్యోగులు తమ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం యూఏఎన్ - ఆధార్ అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ (employee provident fund) స్పష్టం చేసింది. ఆ కేటగిరీలు ఏవంటే..
ఈ కేటగిరీల ఉద్యోగులు
(1.) భారత్ లో తమ వర్క్ అసైన్ మెంట్ పూర్తి చేసుకుని ఆధార్ పొందకుండా భారత్ ను వదిలివెళ్లిన అంతర్జాతీయ కార్మికులు.
(2.) ఆధార్ తీసుకోకుండా విదేశాలకు వలస వెళ్లి అక్కడ పౌరసత్వం తీసుకున్న భారతీయులు.
(3.) "ఉద్యోగి"గా అర్హత పొంది, ఈపీఎఫ్ & ఎంపీ చట్టం పరిధిలోకి వచ్చే సంస్థల జాబితాలో ఉద్యోగులుగా ఉన్న నేపాల్ పౌరులు, భూటాన్ పౌరులు. వీరు భారతదేశంలో నివసించరు. అందువల్ల, వీరికి ఆధార్ ఉండదు.
(4.) ఆధార్ (aadhaar) లేనప్పుడు, అంతర్జాతీయ కార్మికుల జాతీయతలను ధృవీకరించడానికి పాస్ పోర్ట్ లు లేదా భూటాన్, నేపాల్ నుండి వచ్చిన వారికి పౌరసత్వ గుర్తింపు సర్టిఫికేట్ / డాక్యుమెంట్ వంటి ప్రత్యామ్నాయ పత్రాలను ఉపయోగించాలి.
ఈపీఎఫ్ వో సర్క్యులర్ ఏం చెప్పింది?
మినహాయింపు కోరే వారి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఈపీఎఫ్ వో (EPFO) తన సర్క్యులర్ లో పేర్కొంది. వెరిఫికేషన్ కోసం వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. అటువంటి కేసులను ప్రాసెస్ చేయడానికి కార్యాలయ ఇన్ ఛార్జ్ (OIC) నుండి అనుమతి పొందవచ్చు. దీని కోసం ఇ-ఆఫీస్ ఫైల్ ను నిర్వహించాలి. అధికారులు ఇలాంటి అన్ని సందర్భాల్లో బ్యాంకు ఖాతాలను నిశితంగా పరిశీలించి, బ్యాలెన్స్ రూ.5 లక్షలు దాటితే యజమాని నుంచి ధృవీకరణ కోరవచ్చు.
టాపిక్