Oppo Reno 11 launched : ఇండియాలో ఒప్పో రెనో 11 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధర వివరాలు..-oppo reno 11 series launched in india price specs details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oppo Reno 11 Launched : ఇండియాలో ఒప్పో రెనో 11 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధర వివరాలు..

Oppo Reno 11 launched : ఇండియాలో ఒప్పో రెనో 11 సిరీస్​ లాంచ్​- ఫీచర్స్​, ధర వివరాలు..

Sharath Chitturi HT Telugu
Jan 12, 2024 12:58 PM IST

Oppo Reno 11 launched in India : ఒప్పో రెనో 11 సిరీస్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఇందులో రెండు గ్యాడ్జెట్స్​ ఉంటాయి. వాటి ఫీచర్స్​, ధర వివరాలు ఇవే..

ఇండియాలో ఒప్పో రెనో 11 సిరీస్​ లాంచ్
ఇండియాలో ఒప్పో రెనో 11 సిరీస్​ లాంచ్

Oppo Reno 11 launched in India : ఒప్పో సంస్థ సరికొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. దీని పేరు ఒప్పో రెనో 11. ఇందులో రెండు గ్యాడ్జెట్స్​ ఉంటాయి. అవి.. రెనో 11 5జీ, రెనో 11 ప్రో. స్నాప్​డ్రాగన్ 8 జెన్ 1 ఎస్​ఓసీతో గత ఏడాది చైనాలో లాంచ్ అయిన ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​.. తాజాగా ఇండియన్​ మార్కెట్​లోకి అడుగుపెట్టాయి.

ఒప్పో రెనో 11 సిరీస్​ ఫీచర్స్​ ఇవే..

ఈ రెండు ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్​లలో 6.7 ఇంచ్​ ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 2412 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్​ బ్రైట్​నెస్​ను కలిగి ఉన్నాయి.

Oppo Reno 11 series 5G price : అంతేకాకుండా, ఒప్పో రెనో 11 5జీ సిరీస్​లో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత కలర్ ఓఎస్ 14 సాఫ్ట్​వేర్​ ఉంటుంది. వైఫై 6, ఎన్​ఎఫ్​సీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, టైప్-సీ పోర్ట్​తో సహా అవసరమైన అన్ని కనెక్టివిటీ ఫీచర్స్​ ఈ ఫోన్స్​లో ఉన్నాయి.

ఇక ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఒప్పో రెనో 11 5జీ సిరీస్​లోని గ్యాడ్జెట్స్​లో 50ఎంపీ ప్రైమరీ, 32ఎంపీ టెలిఫొటో, 8 ఎంపీ అల్ట్రా-వైడ్​ లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

Oppo Reno 11 pro price : ఒప్పో రెనో 11 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్​ ఉంటుంది. 12 జీబీ LPDDR5X ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్​తో ఈ స్మార్ట్​ఫోన్​ వస్తుంది. రెనో 11 ప్రోలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్​కి లభిస్తోంది.

ఇక ఒప్పో రెనో 11లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్​సెట్ ఉంటుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్​తో రెండు స్టోరేజ్ వేరియంట్ల లభిస్తున్నాయి. రెనో 11లో 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని 67వాట్ ఛార్జర్ ద్వారా ఫాస్ట్​ ఛార్జ్ చేసుకోవచ్చు.

ఒప్పో రెనో 11 సిరీస్​ ధర..

Oppo Reno 11 features : ఒప్పో రెనో 11 5జీ 8 జీబీ ర్యామ్ -128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .29,999గా ఉంది. ఇక 8 జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ . 31,999గా ఉంది. ఒప్పో రెనో 11 ప్రో 12 జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది.

జనవరి 25 నుంచి ఫ్లిప్​కార్ట్​, ఒప్పో స్టోర్, ఇతర రిటైల్ అవుట్​లెట్స్​లో.. రెండు ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం