Ola ‘December to Remember’ offers: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తున్న వారికి గుడ్‍న్యూస్ ఇది. డిసెంబర్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. డిసెంబర్ టు రిమెంబర్ పేరిట వీటిని ఇస్తోంది. ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్ ధర ఉండనుంది. అలాగే జీరో డౌన్ పేమెంట్‍తో పాటు మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్లు, పూర్తి వివరాలు ఇవే.
Ola S1 Pro Discount: డిసెంబర్ టు రిమెంబర్‌లో భాగంగా.. ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది ఓలా. అంటే రూ.1.40లక్షల విలువైన ఈ స్కూటర్‌ను రూ.1.30 లక్షల (ఎక్స్-షోరూమ్)కే ప్రస్తుతం దక్కించుకోవచ్చు.
ఓలా ఎస్1 (Ola S1), ఎస్1 ఎయిర్ (Ola S1 Air) స్కూటర్‌లపై ధర డిస్కౌంట్ లేకున్నా కొన్ని బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇవి ఓలా ఎస్1 ప్రోపై కూడా ఉంటాయి. డిసెంబర్ ఆఫర్లలో భాగంగా.. జీరో డౌన్ పేమెంట్‍తో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. నెలకు కనిష్టంగా రూ.2,499 మాత్రమే చెల్లించేలా ఈఎంఐ ఆప్షన్‍ను ఎంపిక చేసుకోవచ్చు. 8.99 శాతం వడ్డీరేటు ఉంటుంది. వెహికల్ ఫైనాన్స్‌పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ ఉండదు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు కూడా ఉంటాయి.
కొనుగోలు చేసిన వెంటనే ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ద్వారా స్కూటర్‌ను వెంటనే డెలివరీ తీసుకోవచ్చు. ఓలా హైపర్ చార్జ్ నెట్‍వర్క్ స్టేషన్లలో సంవత్సరం పాటు ఉచితంగా ఓలా స్కూటర్‌లకు చార్జింగ్ సేవలు పొందవచ్చు. రెఫరల్ ప్రోగ్రామ్ రివార్డ్స్ కింద ఇప్పటికే ఓలా స్కూటర్‌లు వాడుతున్న వారు కూడా బెనిఫిట్స్ పొందవచ్చు.
Ola Contest: కస్టమర్లకు ఉచితంగా 10 ఎస్1 ప్రో వాహనాలను అందించేందుకు కాంటెస్టును కూడా నిర్వహిస్తోంది ఓలా. దీంట్లో పాల్గొనాలనుకునే కస్టమర్లు.. దగ్గర్లోని ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ కు వెళ్లి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టెస్ట్ రైడ్ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఓలా నుంచి మూడు ఎలక్ట్రిక్ స్కూటర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఓలా ఎస్1 ఎయిర్ ధర రూ.84,999, ఓలా ఎస్1 ధర రూ.99,999గా ఉంది. ఓలా ఎస్1 ప్రో రూ.1.40లక్షలు (డిస్కౌంట్ లేకుండా) ధరకు లభిస్తోంది. ఫేమ్ సబ్సిడీ తర్వాత ఉండే ఎక్స్ షోరూమ్ ధరలు ఇవి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. ఈనెలాఖరులోగా మరో 100 సెంటర్లను ప్రారంభించాలని ఓలా నిర్ణయించుకుంది.