Changes in NPS: నేషనల్ పెన్షన్ సిస్టమ్ విత్ డ్రాయల్స్ లో కొత్త నిబంధనలు; ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..-nps want to go for partial withdrawal these latest changes will come into force soon ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Changes In Nps: నేషనల్ పెన్షన్ సిస్టమ్ విత్ డ్రాయల్స్ లో కొత్త నిబంధనలు; ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..

Changes in NPS: నేషనల్ పెన్షన్ సిస్టమ్ విత్ డ్రాయల్స్ లో కొత్త నిబంధనలు; ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..

HT Telugu Desk HT Telugu
Feb 06, 2024 12:28 PM IST

Changes in NPS withdrawals: విత్ డ్రాయల్స్ కు సంబంధించి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. విత్ డ్రాయల్స్ కు వర్తించేలా కొత్తగా పలు నిబంధనలను చేర్చారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Changes in NPS withdrawals: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద పెన్షన్ ఉపసంహరణ నిబంధనలను నిర్దేశిస్తూ పెన్షన్ ఫండ్ బాడీ పీఎఫ్ఆర్డీఏ (Pension Fund Regulatory and Development Authority PFRDA) కొత్త సర్క్యులర్ ను విడుదల చేసింది. ఈ నిబంధనలు 2024 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఎన్పీఎస్ ఉపసంహరణ నిబంధనలు

తాజా నిబంధనల ప్రకారం చందాదారులు తమ NPS వ్యక్తిగత పెన్షన్ ఖాతాలో తమ కంట్రిబ్యూషన్లలో పాతిక శాతానికి మించకుండా యజమాని కంట్రిబ్యూషన్ ను మినహాయించి ఉపసంహరించుకోవచ్చు. ఈ కింది కారణాలతో చందాదారులు తమ వాటా మొత్తంలో నుంచి 25% మించకుండా విత్ డ్రాయల్స్ చేసుకోవడానికి అనుమతిస్తారు.

1. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న బిడ్డతో సహా చందాదారుల పిల్లల ఉన్నత విద్య కోసం.

2. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న బిడ్డతో సహా వారి పిల్లల వివాహం కోసం..

3. చందాదారుడి స్వంత పేరు మీద లేదా ఉమ్మడి పేరు మీద నివాస గృహం లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం లేదా నిర్మించడం కోసం.

4. చందాదారుడు ఇప్పటికే ఇంటిని కలిగి ఉన్నప్పుడు ఎటువంటి ఉపసంహరణ అనుమతించబడదని గమనించడం ముఖ్యం.

5. క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యం, ప్రైమరీ పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్, మల్టిపుల్ స్క్లెరోసిస్, ప్రధాన అవయవ మార్పిడి, కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ వంటి వ్యాధుల చికిత్స కోసం ఆసుపత్రిలో చేరడం కోసం; అలాగే ఆ చికిత్స ఖర్చులతో సహా నిర్దిష్ట అనారోగ్యాల చికిత్స కోసం.

6. చందాదారుడి వైకల్యం వల్ల ఉత్పన్నమయ్యే వైద్య సంబంధిత ఖర్చుల కోసం.

7. స్కిల్ డెవలప్మెంట్/ రీ స్కిల్లింగ్ కోసం అయ్యే ఖర్చుల కోసం.

8. చందాదారుడు తన స్వంత వెంచర్ లేదా ఏదైనా స్టార్టప్ స్థాపనకు అయ్యే ఖర్చుల కోసం.

ఈ షరతులు వర్తిస్తాయి..

చందాదారుడు తన కంట్రిబ్యూషన్ నుంచి పాక్షికంగా ఉపసంహరణ చేపట్టాలంటే కింద పేర్కొన్న షరతులు వర్తిస్తాయి. అవి..

1. ఎన్పీఎస్ సబ్స్క్రైబర్ గా చేరిన తేదీ నుంచి కనీసం మూడేళ్ల పాటు ఎన్పీఎస్ లో సభ్యుడిగా ఉండాలి.

2. పాక్షిక ఉపసంహరణ మొత్తం చందాదారుల వ్యక్తిగత పెన్షన్ ఖాతాలోని మొత్తం కంట్రిబ్యూషన్లలో నాలుగింట ఒక వంతుకు మించకూడదు.

3. చందాదారుడు ఎన్పీఎస్ కింద తమ మొత్తం సబ్స్క్రిప్షన్ కాలవ్యవధిలో గరిష్టంగా మూడు పాక్షిక ఉపసంహరణలు చేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది.

ఎలా అప్లై చేయాలి..

  • చందాదారుడు తన విత్ డ్రాయల్ రిక్వెస్ట్ ను ప్రాసెస్ చేయడానికి, తన ఉపసంహరణ ఉద్దేశ్యాన్ని తెలియజేస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ తో పాటు ఉపసంహరణ అభ్యర్థనను సంబంధిత ప్రభుత్వ నోడల్ కార్యాలయం లేదా పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ ద్వారా సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సిఆర్ ఎ) కి సమర్పించాలి.
  • చందాదారుడి బ్యాంక్ ఖాతా ధృవీకరణ అనంతరం ఈ పాక్షిక ఉపసంహరణ అభ్యర్థనలను సీఆర్ఏ ద్వారా ప్రాసెస్ చేస్తారు.

Whats_app_banner