Warren Buffett will : వారెన్ బఫెట్ మరణం తర్వాత.. ఆ 127 బిలియన్ డాలర్ల పరిస్థేంటి?
Warren Buffett will : బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ వారెన్ బఫెట్ మరణానంతరం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు అందవు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు.
దిగ్గజ ఇన్వెస్టర్, బర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్ వారెన్ బఫెట్.. తన వీలునామాలో పలు కీలక సవరణలు చేశారు. తన మరణానంతరం.. బిల్ అండ్ మెలిండా ఫౌండేషన్‌కి ఇక ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వడంలేదని ప్రకటించారు. దాని బదులు.. తమ ముగ్గురు బిడ్డలు నడిపే కొత్త ఛారిటెబుల్ ట్రస్ట్‌కి సంపదను కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు.
ప్రస్తుతానికైతే.. 93ఏళ్ల వారెన్ బఫెట్ సంపద 127 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా తన సంపదలో ఇప్పటివరకు సుమారు 40 బిలియన్ డాలర్లలను బిల్ అండ్ మెలిండా గెట్స్ ఫౌండేషనన్కి విరాళంగా ఇచ్చారు.
వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. తాను వెళ్లిపోయాక తన వీలునామా ఎలా ఉంటుందనే విషయంపై ఒక ప్రివ్యూ ఇచ్చారు. గేట్స్ ఫౌండేషన్‌కు తన మద్దతును నిలిపివేస్తున్నట్టు నొక్కి మరీ చెప్పారు.
వారెన్ బఫెట్ పిల్లల పేర్లు హోవార్డ్ (71), సూసీ (69) పీటర్ (66). వీరు ముగ్గురు కలిసి పర్యవేక్షించే కొత్త ఛారిటెబుల్ ట్రస్ట్‌కి బఫెట్ సంపద వెళుతుంది.. అందువల్ల, బఫెట్ మరణించిన తర్వాత, ఆయన సంపదతో చేయవలసిన విరాళాలను ఈ ముగ్గురు ఏకగ్రీవంగా నిర్ణయిస్తారు.
"నా తర్వాత.. నా ముగ్గురు పిల్లలు సరైన నిర్ణయాలు తీసుకుంటారని నాకు 100% నమ్మకం ఉంది. నా ముగ్గురు పిల్లల విలువల గురించి నేను చాలా మంచిగా భావిస్తున్నాను,' అని బఫెట్ అన్నారు.
2021లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, తన భార్య మెలిండా గేట్స్‌తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా అదే ఏడాదిలో, 2006 నుంచి ఫౌండేషన్ ట్రస్టీగా కొనసాగుతున్న బపెట్.. ఆ పదవి నుంచి తప్పుకున్నారు. కానీ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ పెట్టుబడిదారులలో ఒకరిగా పేరొందిన బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మన్.. 2006 నుంచి గేట్స్ ఫౌండేషన్‌కు అత్యంత అంకితభావం, ఉదార భావంతో మద్దతిచ్చారు.
ప్రస్తుతం సీఈఓ మార్క్ సుజ్మాన్ ప్రైవేట్ ఫౌండేషన్‌ని నడుపుతున్నారు.
"ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన, ఉత్పాదక జీవితాన్ని గడపగల ప్రపంచాన్ని సృష్టించడానికి ఫౌండేషన్ పనిని ప్రోత్సహించడంలో, రూపొందించడంలో బఫెట్ అమూల్యమైన పాత్ర పోషించారు," అని సుజ్మాన్ ప్రశంసించారు. 18 ఏళ్లకు పైగా విరాళాలు, సలహాల ద్వారా గేట్స్ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ ఎంతో ఉదారంగా వ్యవహరించారని ఆమె పేర్కొన్నారు.
" నా కుటుంబంలాగే అదృష్టవంతులు కాని ప్రజలకు సహాయం చేయడానికి నా సంపద ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను," అని వాల్ స్ట్రీట్ జర్నల్‌తో చెప్పారు బఫెట్. “నేను చాలా అదృష్టవంతుడిని. ప్రజలకు ఉపయోగపడేందుకు చాలా మార్గాలు ఉన్నాయి,” అని బఫెట్ అభిప్రాయపడ్డారు.
వారెన్ బఫెట్ ఇంతకాలం కేవలం గేట్స్ ఫౌండేషన్‌కు మాత్రమే విరాళాలు ఇవ్వడం లేదు. వ్యాపారవేత్త తన కుటుంబానికి సంబంధించిన మరో నాలుగు సంస్థలకు కూడా క్రమం తప్పకుండా మద్దతు ఇస్తూ వచ్చారు. ప్రస్తుతానికి ఈ ఐదు ఫౌండేషన్లకు ఆయన చేసిన దాతృత్వ సేవలు ఆయన జీవించి ఉన్నంత కాలం కొనసాగుతాయి.
బెర్క్‌షైర్ హాత్వేలో బఫెట్ దీర్ఘకాలిక భాగస్వామి చార్లీ ముంగర్ 2023 లో 99 సంవత్సరాల వయస్సులో మరణించారు.
సంబంధిత కథనం