NMDC Q1 Results: 13 శాతం పెరిగిన ఎన్ఎండీసీ నికర లాభాలు; ఆదాయంలో భారీ వృద్ధి
NMDC Q1 Results: ప్రభుత్వ రంగ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్ఎండీసీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. ఈ క్యూ 1 లో ఎన్ఎండీసీ రూ. 1, 661 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
NMDC Q1 Results: ప్రభుత్వ రంగ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్ఎండీసీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (Q1FY24) ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. ఈ క్యూ 1 లో ఎన్ఎండీసీ రూ. 1, 661 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం క్యూ1 లో సంస్థ సాధించిన నికర లాభాలైన రూ. 1,471.24 కోట్లతో పోలిస్తే 13% అధికం.
ఆదాయం బావుంది..
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) ఆదాయం విషయంలో ఈ క్యూ1లో మెరుగైన ఫలితాలను సాధించింది. ఎన్ఎండీసీ మొత్తం ఆదాయం 2023 మార్చ్ - జూన్ త్రైమాసికంలో రూ. 5,688.87 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ మొత్తం ఆదాయం రూ. 4,913.06 కోట్లుగా ఉంది. ఆదాయంతో పాటు సంస్థ ఖర్చులు కూడా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ 1లో సంస్థ మొత్తం వ్యయం రూ. 2,968.94 కోట్లు కాగా, ఈ క్యూ1 లో అది రూ. 3,476.55 కోట్లకు పెరిగింది. ఈ క్యూ 1 లో ఐరన్ సెగ్మెంట్లో ఎన్ఎండీసీ రూ. 2, 106 కోట్ల ఆదాయం సముపార్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ 1లో ఐరన్ సెగ్మెంట్లో సంస్థ మొత్తం ఆదాయం రూ. 1,982 కోట్లుగా ఉంది. ఎన్ఎండీసీ షేర్ విలువ ఎన్ఎస్ఈ లో శుక్రవారం 0.16% తక్కువగా రూ. 113. 50 వద్ద ముగిసింది.