Unified pension form:పెన్షనర్ల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం; ఇక ఒకే యూనిఫైడ్ పెన్షన్ ఫామ్-new single unified pension form launched nine forms merged into one for ease ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Unified Pension Form:పెన్షనర్ల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం; ఇక ఒకే యూనిఫైడ్ పెన్షన్ ఫామ్

Unified pension form:పెన్షనర్ల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం; ఇక ఒకే యూనిఫైడ్ పెన్షన్ ఫామ్

Sudarshan V HT Telugu
Aug 31, 2024 04:23 PM IST

Unified pension form: పెన్షనర్ల కోసం కొత్త ఏకీకృత పెన్షన్ ఫామ్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇకపై పెన్షనర్లు 9 వేర్వేరు ఫామ్స్ ను నింపాల్సిన అవసరం లేదని, ఈ ఒక్క ఫామ్ ను ఫిలప్ చేసి, ఈ-సైన్ చేస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

పెన్షనర్ల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం; ఇక ఒకే యూనిఫైడ్ పెన్షన్ ఫామ్
పెన్షనర్ల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం; ఇక ఒకే యూనిఫైడ్ పెన్షన్ ఫామ్

Unified pension form: రిటైర్మెంట్ అనంతరం పెన్షనర్ల ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లు మరియు పెన్షనర్లు అనేక ఫారాలను ఫిలప్ చేయాల్సిన సంక్లిష్టతను తగ్గించడానికి, వారి సమయం, శ్రమను గణనీయంగా తగ్గించడానికి తొమ్మిది వేర్వేరు ఫారాలను విలీనం చేసి ఒకే ఏకీకృత పెన్షన్ ఫారాన్ని () ప్రభుత్వం ప్రారంభించింది.

డిసెంబర్ 24, 2024 నుంచి..

డిసెంబర్ 24, 2024 నుంచి పదవీ విరమణ చేసే పెన్షనర్లందరూ 6 ఏ అనే ఈ కొత్త ఫారాన్ని ఉపయోగించవచ్చు. ఈ-హెచ్ ఆర్ ఎంఎస్ (e-HRMS) లో ఉన్న రిటైర్డ్ అధికారులు ఈ-హెచ్ ఆర్ ఎంఎస్ (కేవలం సూపర్ యాన్యుయేషన్ కేసులు) ద్వారా ఫారం 6-ఏ నింపాలని, ఈ-హెచ్ ఆర్ ఎంఎస్ లో లేని రిటైర్డ్ అధికారులు ‘భవిష్య’ (Bhavishya) లో ఫారం 6-ఎ నింపాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పెన్షనర్ ఒకే ఈ-సైన్ (ఆధార్ ఆధారిత ఓటీపీ)తో ఫారం 6 ఏ (Form 6-A) ఫారం సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు.

కామన్ సింగిల్ విండో పోర్టల్ కు భవిష్య ప్లాట్ఫామ్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ తో అనుసంధానం అయ్యాయి. ప్రస్తుతం, నెలవారీ పెన్షన్ స్లిప్, స్టేటస్ ఆఫ్ లైఫ్ సర్టిఫికేట్, పెన్షనర్ సబ్మిషన్ ఫారం 16, చెల్లించిన పెన్షన్ బకాయిలు, డ్రా చేసిన పెన్షన్ స్టేట్ మెంట్ వంటి 4 సౌకర్యాలను ఈ బ్యాంకులు అందిస్తున్నాయి. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు, పెన్షన్ అదాలత్ లు, అనుభవ్ అవార్డులు, ప్రీ రిటైర్ మెంట్ కౌన్సెలింగ్ వర్క్ షాప్ లతో సహా పెన్షన్ డిపార్ట్ మెంట్ అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక డ్రైవ్

కుటుంబ పింఛను ఫిర్యాదుల కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించామని జితేంద్ర సింగ్ తెలిపారు. అందులో ఫిర్యాదుల పరిష్కార రేటు 96% దాటిందన్నారు. ఇందులో ఆధారపడిన మైనర్ పిల్లలు, దివ్యాంగ కుమార్తెలు, వితంతువు / విడాకులు పొందిన కుమార్తెలు, ఆధారపడిన తల్లులు, యుద్ధవీరుల వితంతువుల యొక్క దీర్ఘకాలిక పెండింగ్ కేసులు పరిష్కారమయ్యాయని సింగ్ తెలిపారు.