Market updates: కుప్ప కూలిన మార్కెట్లు; 17,810 దిగువకు నిఫ్టీ-market updates sensex plunges 980 pts to settle at 59 845 nifty below 17810 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Market Updates: కుప్ప కూలిన మార్కెట్లు; 17,810 దిగువకు నిఫ్టీ

Market updates: కుప్ప కూలిన మార్కెట్లు; 17,810 దిగువకు నిఫ్టీ

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 09:49 PM IST

Market updates: స్టాక్ మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. కరోనా కొత్త వేరియంట్ భయాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఫార్మా మినహా అన్ని సెక్టార్ల స్టాక్ట్స్ ‘రెడ్’ మార్క్ తోనే ముగిశాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Market updates: భారతీయ స్టాక్ మార్కెట్ల లో శుక్రవారం ’బ్లడ్ బాత్’ కొనసాగింది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడం, చైనాలో కేసుల సంఖ్యలో పెరుగుదలకు కారణమైన కరోనా(corona) ఒమిక్రాన్ బీఎఫ్ 7(omicron bf.7) వేరియంట్ భారత్ లోనూ కనిపించడం, భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను ప్రకటించడం.. స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి.

Sensex plunges 980 pts, Nifty below 17,810: 17,810 దిగువకు నిఫ్టీ

కరోనా(corona) భయాలు, అంతర్జాతీయ పరిణామాలు శుక్రవారం మార్కెట్ ను దెబ్బతీశాయి. ఈక్విటీ సూచీలు సుమారు 2% వరకు కుప్పకూలాయి. 30 కీలక షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్(BSE Sensex) పై వరుసగా నాలుగో రోజు అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దాంతో ఈ సెన్సెక్స్ (BSE Sensex)శుక్రవారం ఒక్కరోజే 980.93 పాయింట్ల కోల్పోయి, 59,845.29 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒక దశలో ఈ సూచీ(BSE Sensex) 1,060 పాయింట్లకు పైగా కోల్పోయింది. అలాగే, ఎన్ఎస్ఈ నిఫ్టీ(NSE Nifty) కూడా 320.55 పాయింట్లు, లేదా 1.77% కోల్పోయి 17,806.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్(BSE Sensex) లో టాటా స్టీల్(Tata Steel) అత్యధికంగా 5 శాతం పైగా నష్టపోయింది. టాటా మోటార్స్(Tata Motors), ఎస్భీఐ(State Bank of India), బజాజ్ ఫిన్ సర్వ్(Bajaj Finserv), విప్రో(Wipro), రిలయన్స్(Reliance Industries), ఇండస్ ఇండ్ బ్యాంక్,(IndusInd Bank) ఎల్ అండ్ టీ(Larsen & Toubro), మారుతీ సుజుకీ (Maruti Suzuki) కూడా భారీగా నష్టపోయాయి. సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ ఈక్విటీ మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. మరోవైపు, బ్రెంట్ క్రూడ్ ధర 1.89% పెరిగి 82.61 డాలర్లకు చేరుకుంది. స్టాక్ ఎక్సేంజ్ సమాచారం ప్రకారం.. గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(FII) సుమారు రూ. 928.63 కోట్ల మేర షేర్లను కొనుగోలు చేయడం విశేషం.

Pharma stocks: ఫార్మా షేర్లు మాత్రం..

మిగతా సెక్టార్ల స్టాక్స్ కుప్పకూలుతున్నా.. ఫార్మా స్టాక్స్ మాత్రం పైపైకి వెళ్లాయి. మోర్పెన్ ల్యాబ్స్(morepen labs) షేర్ వ్యాల్యూ అత్యధికంగా 12.5% పెరిగింది. శిల్ప మెడికేర్(shilpa medi care) షేర్ విలువ 10%, ఐఓఎల్ కెమికల్(IOL chemical) షేర్ వ్యాల్యూ 6%, సువెన్ ఫార్మా(suven pharma) షేర్ 3% పెరిగాయి. ఇవి కాకుండా, కేప్లిన్ పాయింట్ ల్యాబ్, గ్రాన్యూల్స్ ఇండియా, దివిస్(divis labs) ల్యాబ్ ల షేర్లు కూడా భారీగా లాభపడ్డాయి. కరోనా(corona) కేసుల సంఖ్య పెరిగితే.. బిజినెస్ పెరిగి ఫార్మా కంపెనీలు భారీగా లాభాలను ఆర్జిస్తాయన్న అంచనాల నేపథ్యంలో వాటి షేర్ వ్యాల్యూ పెరిగినట్లు భావిస్తున్నారు.

Whats_app_banner