Stock market today: నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 344 పాయింట్ల పతనం
Stock market today: స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Stock market today: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 311 పాయింట్లు కోల్పోయి 60,514 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 18,036 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
టాప్ గెయినర్స్ జాబితాలో సన్ ఫార్మా, ఎన్టీపీసీ,హెచ్‌సీఎల్ టెక్, నెస్లే నిలిచాయి. ఇక టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్ నిలిచాయి.
మార్కెట్ ప్రి ఓపెనింగ్ సెషన్‌లో మార్కెట్లు బాగా పడిపోయాయి. సెన్సెక్స్ 620.66 పాయింట్లు నష్టపోయి 60.205 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149.70 పాయింట్లు పతనమై 17,977 పాయింట్ల వద్ద స్థిరపడింది.
పలు దేశాల్లో కోవిడ్ కేసులు పుంజుకునే అవకాశం ఉందన్న ఆందోళనలతో వరుసగా మూడో సెషన్‌కు నష్టాలను పొడిగిస్తూ భారతీయ స్టాక్ సూచీలు గురువారం మరింతగా నష్టపోయాయి.
నిన్న గురువారం సెన్సెక్స్ 241.02 పాయింట్లు క్షీణించి 60,826.22 పాయింట్ల వద్ద, నిఫ్టీ 71.75 పాయింట్లు నష్టంతో 18,127.35 పాయింట్ల వద్ద ముగిశాయి.
కోవిడ్-19 పరిస్థితి, దానికి సంబంధించిన అంశాలను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్.7 వైరస్ విజృంభణతో చైనాలో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి.