Lenovo Tab P12 : లెనోవో ట్యాబ్ పీ12 వచ్చేస్తోంది.. అదిరిపోయే ఫీచర్స్‌తో!
Lenovo Tab P12 : కొత్తగా ఓ ట్యాబ్ కొనాలని భావిస్తున్నారా? అయితే లెనోవో ట్యాబ్ పీ12 గురించి మీరు తెలుసుకోవాల్సిందే!
Lenovo Tab P12 : లెనోవో ట్యాబ్ పీ12 గ్యాడ్జెట్ గత నెలలో యూరోప్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇక ఇప్పుడు.. ఈ ట్యాబ్లెట్ ఇండియా మార్కెట్లోకి కూడా వస్తోంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఓ పోస్టర్ దర్శనమిచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ లెనోవో ట్యాబ్ పీ12.. సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు సేల్కు వెళుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఈ కొత్త ట్యాబ్ స్పెసిఫికేషన్స్ ఏంటి?
లెనోవో ట్యాబ్ పీ12లో.. 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 12.7 ఇంచ్ ఎల్టీపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ 273పీపీఐగా ఉంది. క్వాడ్ జేబీఎల్ స్పీకర్స్ వస్తున్నాయి. ఇక 13ఎంపీ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరా, ఆర్జీబీ సెన్సార్, వైడ్ ఫీల్డ్ వ్యూ వంటివి లభిస్తున్నాయి. రేర్‌లో 8ఎంపీ ఆటోఫోకస్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్లు వస్తున్నాయి.
Lenovo Tab P12 price : ఈ సరికొత్త ట్యాబ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిట్ 13 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. రెండేళ్ల ఓఎస్ అప్డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ వారెంటీ ఈ గ్యాడ్జెట్ సొంతం. 4జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్- 128జీబీ/256జీబీ వేరియంట్స్ ఇందులో ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ కూడా లభిస్తోంది.
ఇదీ చూడండి:- OnePlus Pad: ‘వన్‍ప్లస్ ప్యాడ్’ ట్యాబ్ ధర ఇదే.. అధికారికంగా ప్రకటించిన వన్‍ప్లస్: సేల్ డేట్, ఆఫర్ల వివరాలు
ఈ లెనోవో ట్యాబ్ పీ12లో యాక్సలరోమీటర్ జీ సెన్సార్, ఆర్జీబీ సెన్సార్, గైరోస్కోప్, ఈ-కంపాస్, హాల్ సెన్సార్‌తో పాటు వివిధ సెన్సార్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం.. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. వైఫై-6, డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, యూఎస్బీ టైప్-సీ 2.0 పోర్ట్, 10,2000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ గ్యాడ్జెట్ 10 గంటల పాట పనిచేస్తుందని సంస్థ చెబుతోంది. స్టార్మ్ గ్రే, ఓట్ కలర్స్‌లో ఈ ట్యాబ్ అందుబాటులోకి రానుంది.
Lenovo Tab P12 price in India : లెనోవో ట్యాబ్ పీ12 ధరకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా.. యూరోప్‌లో దీని ప్రారంభ ధర 399 యూరోలుగా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 36వేలు!
సంబంధిత కథనం