Kia Sonet vs Mahindra XUV300: కియా సొనెట్ వర్సెస్ మహింద్రా ఎక్స్ యూ వీ 300; ఏది బెస్ట్?-kia sonet vs mahindra xuv300 which one to choose ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kia Sonet Vs Mahindra Xuv300: కియా సొనెట్ వర్సెస్ మహింద్రా ఎక్స్ యూ వీ 300; ఏది బెస్ట్?

Kia Sonet vs Mahindra XUV300: కియా సొనెట్ వర్సెస్ మహింద్రా ఎక్స్ యూ వీ 300; ఏది బెస్ట్?

HT Telugu Desk HT Telugu
Feb 13, 2024 07:39 PM IST

Kia Sonet vs Mahindra XUV300: కియా కార్లలో సెల్టోస్ తర్వాత భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ కియా సొనెట్. ఈ సెగ్మెంట్లో కఠినమైన పోటీ ఉన్నప్పటికీ, ఇది వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు, దేశీ దిగ్గజం మహింద్ర అండ్ మహింద్ర నుంచి వచ్చిన ఎక్స్ యూ వీ 300 కూడా మంచి సేల్స్ ను రాబడ్తోంది.

కియా సొనెట్ వర్సెస్ మహింద్రా ఎక్స్ యూ వీ 300
కియా సొనెట్ వర్సెస్ మహింద్రా ఎక్స్ యూ వీ 300

Kia Sonet vs Mahindra XUV300: కియా సోనెట్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUVలలో ఒకటి. భారత్ లో SUVల డిమాండ్ భారీగా పెరుగతోంది. దాంతో, అన్ని కార్ తయారీ సంస్థలు ఈ సెగ్మెంట్ పై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. సెల్టోస్ మిడ్-సైజ్ SUVతో విజయాన్ని రుచి చూసిన తర్వాత, కియా దేశంలోని కాంపాక్ట్ SUV విభాగంలో సోనెట్‌ను పరిచయం చేసింది. కియా ఇండియా ఈ ఏడాది జనవరిలో అప్ డేట్ చేసిన సోనెట్ కాంపాక్ట్ SUVని విడుదల చేసింది. ఈ అప్ డేటెడ్ మోడల్ కియా సోనెట్ లో కంపెనీ డిజైన్, ఫీచర్లలో కీలక మార్పులు చేసింది. కానీ, ఓవరాల్ ఔట్ లుక్ ను మాత్రం అలాగే కొనసాగించింది.

Kia Sonet vs Mahindra XUV300: కియా సొనెట్ వర్సెస్ మహింద్ర ఎక్స్ యూ వీ 300

  • ధర: Kia Sonet కాంపాక్ట్ SUV ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 14.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. మరోవైపు, మహీంద్రా XUV300 ధర కూడా రూ. 7.99 లక్షల నుండి రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. Kia Sonet, Mahindra XUV300 SUVలు రెండూ ఒకే ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే కియా టాప్-ఎండ్ వేరియంట్ ధర ఎక్స్ యూ వీ 300 టాప్ ఎండ్ వేరియంట్ ధర కన్నా ఎక్కువ ఉంది.
  • స్పెసిఫికేషన్స్: కియా సోనెట్ రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో 1.2-లీటర్ యూనిట్, 1.0-లీటర్ టర్బో చార్జ్డ్ యూనిట్ ఉన్నాయి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఇది 82 bhp గరిష్ట శక్తిని, 115 Nm పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది.
  • కియా సొనెట్ (kia sonet) 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆరు-స్పీడ్ iMT మరియు ఏడు-స్పీడ్ DCTతో ట్రాన్స్‌మిషన్ ఎంపికలుగా అందుబాటులో ఉంది. ఈ మోటార్ 118 bhp గరిష్ట శక్తిని, 172 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కియా సొనెట్ డీజిల్ వేరియంట్ 1.5-లీటర్ ఇంజన్‌తో 114 bhp గరిష్ట శక్తిని, 250 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.
  • మహీంద్రా XUV300 (Mahindra XUV300) రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 108 bhp గరిష్ట శక్తిని, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇతర 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్ 128 bhp గరిష్ట శక్తిని, 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. డీజిల్ ఇంజన్ 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్, 115 bhp శక్తిని, 300 Nm టార్క్‌ని విడుదల చేయగలదు. వీటిలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ 6 -స్పీడ్ AMT యూనిట్ ఉన్నాయి.

Whats_app_banner