Jio, Airtel, VI users in Nov 2022: జియో, ఎయిర్ టెల్ లకు పెరిగిన సబ్ స్క్రైబర్లు-jio airtel up mobile subscribers tally voda idea loses 18 2 lakh users in nov trai data
Telugu News  /  Business  /  Jio, Airtel Up Mobile Subscribers Tally, Voda Idea Loses 18.2 Lakh Users In Nov: Trai Data
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Jio, Airtel, VI users in Nov 2022: జియో, ఎయిర్ టెల్ లకు పెరిగిన సబ్ స్క్రైబర్లు

27 January 2023, 21:46 ISTHT Telugu Desk
27 January 2023, 21:46 IST

Jio, Airtel, VI users in Nov 2022: గత సంవత్సరం నవంబర్ నెలలో మొబైల్ సబ్ స్క్రైబర్లను టెలీకాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ గణనీయంగా పెంచుకున్నాయి.

Jio, Airtel, VI users in Nov 2022: వివిధ టెలీకాం సంస్థల సబ్ స్క్రైబర్ల వివరాలను శుక్రవారం టెలీకాం రెగ్యలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (Telecom Regulatory Authority of India TRAI) విడుదల చేసింది. రిలయన్స్ జియో (Reliance Jio), భారతి ఎయిర్ టెల్ (Bharti Airtel) ల సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతూనే ఉండగా, వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) సబ్ స్క్రైబర్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

Jio, Airtel, VI users in Nov 2022: నవంబర్ నెలలో..

2022 నవంబర్ నెలలో రిలయన్స్ జియో (Reliance Jio), భారతి ఎయిర్ టెల్ (Bharti Airtel) టెలీకాం సంస్థలు అన్ని సెక్టార్లు కలుపుకుని మొత్తంగా దాదాపు 25 లక్షల కొత్త సబ్ స్క్రైబర్లను సంపాదించాయి. మరోవైపు, ఇదే నవంబర్ నెలలో వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) సుమారు 18.3 లక్షల సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. భారతదేశ అతిపెద్ద టెల్కోగా అవతరించిన రిలయన్స్ జియో (Reliance Jio) 2022 నవంబర్ నెలలో కొత్తగా 14.26 లక్షల సబ్ స్క్రైబర్లను సంపాదించింది. మరోవైపు, భారతి ఎయిర్ టెల్ (Bharti Airtel) 10.56 లక్షల కొత్త యూజర్లను సంపాదించింది.

Jio, Airtel, VI users in Nov 2022: తగ్గుతున్న వీఐ యూజర్ బేస్

నవంబర్ 2022 చివరి నాటికి భారత్ లో రిలయన్స్ జియో (Reliance Jio) మొత్తం సబ్ స్క్రైబర్ల సంఖ్య 42.28 కోట్లు. అలాగే, భారతి ఎయిర్ టెల్ (Bharti Airtel) మొత్తం యూజర్ల సంఖ్య 42.13 కోట్లు. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించే కొత్త ప్లాన్స్ తో ఈ రెండు టెల్కోలు ఈ పోటీలో ముందంజలో ఉన్నాయి. మరోవైపు, నవంబర్ 2022 చివరి నాటికి వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) మొత్తం సబ్ స్క్రైబర్ల సంఖ్య 24.37 కోట్లకు పడిపోయింది. బ్రాడ్ బాండ్ యూజర్ల విషయానికి వస్తే, భారత్ లో మొత్తం బ్రాడ్ బాండ్ యూజర్ల సంఖ్య నవంబర్ 2022 చివరి నాటికి 82.538 కోట్లకు చేరింది. ఒక్క నవంబర్ నెలలోనే బ్రాడ్ బాండ్ యూజర్ల సంఖ్య 0.47% పెరిగింది. మొత్తం బ్రాడ్ బ్యాండ్ యూజర్లలో సుమారు 43.01 కోట్ల మంది రిలయన్స్ జియో (Reliance Jio) కు, 23.05 కోట్ల మంది ఎయిర్ టెల్ (Bharti Airtel) కు, 12.34 కోట్ల మంది వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) కు, 2.58 కోట్ల మంది బీఎస్ఎన్ఎల్ కు సబ్ స్క్రైబర్స్ గా ఉన్నారు.