Vodafone Idea (Vi) New Plans: ఒకేసారి 850జీబీ డేటా వచ్చేలా వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్.. మరొకటి కూడా..-vodafone idea launched 2 new prepaid plans with 365 days validity ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Vodafone Idea (Vi) New Plans: ఒకేసారి 850జీబీ డేటా వచ్చేలా వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్.. మరొకటి కూడా..

Vodafone Idea (Vi) New Plans: ఒకేసారి 850జీబీ డేటా వచ్చేలా వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్.. మరొకటి కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 05, 2022 02:00 PM IST

Vodafone Idea (Vi) New Plans: వొడాఫోన్ ఐడియా కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్‍లను ప్రవేశపెట్టింది. సంవత్సరం వ్యాలిడిటీతో వీటీని తీసుకొచ్చింది.

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్
వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్స్ (AFP)

Vodafone Idea (Vi) New Plans: టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea - Vi) కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్‍లను తీసుకొచ్చింది. సంవత్సరం వ్యాలిడిటీతో ఈ ప్లాన్‍లు వచ్చాయి. రూ.2,999, రూ.2,899 ప్లాన్‍లను Vi కొత్తగా ప్రవేశపెట్టింది. ఇందులో ఓ ప్లాన్ ద్వారా ఒకేసారి 850డేటా వస్తుంది. అంటే రోజువారిగా కాకుండా ఒకేసారి 850జీబీ డేటా దక్కుతుంది. అలాగే వొడాఫోన్ ఐడియా ఇచ్చే అదనపు బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‍లతో లభిస్తాయి.

వొడాఫోన్ ఐడియా (Vi) రూ.2,999 ప్లాన్

Vi 2999 Prepaid Plan: వొడాఫోన్ ఐడియా కొత్తగా తీసుకొచ్చిన రూ.2,999 ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా బల్క్‌గా 850జీబీ డేటా దక్కుతుంది. అంటే ప్రతీ రోజు కొంతమేర డేటా కాకుండా ఒకేసారి ఈ డేటా లభిస్తుంది. రోజువారి పరిమితి ఉండదు. అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీరోజు 100ఎస్ఎంస్‍లు వాడుకోవచ్చు. బింజ్ ఆల్‍నైట్ (Binge All Night) బెనిఫిట్ కూడా ఈ ప్లాన్‍తో దక్కుతుంది. అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఉచితంగా ఎంత డేటా అయినా వాడుకోవచ్చు.

వొడాఫోన్ ఐడియా (Vi) రూ.2,899 ప్లాన్

Vi 2899 Prepaid Plan: వొడాఫోన్ ఐడియా కొత్తగా లాంచ్ చేసిన రెండో ప్లాన్ ఇది. రూ.2,899 ప్లాన్ తీసుకుంటే ప్రతీ రోజు 1.5జీబీ డేటా లభిస్తుంది. అన్‍లిమిడెట్ కాల్స్, ప్రతీరోజు 100ఎస్ఎంఎస్‍లు దక్కుతాయి. ఈ ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్ లాంటి బెనిఫిట్స్ ఈ ప్లాన్‍తో దక్కుతాయి.

వీకెండ్ డేటా రోల్ఓవర్ బెనిఫిట్ కింద.. వారంలోని నాలుగు రోజుల్లో మిగిలిన డేటా వారంతమైన శని, ఆదివారాల్లో యూజర్లకు లభిస్తుంది. డేటా డిలైట్ కింద.. ఉచితంగా ప్రతీనెల 2జీబీ డేటా దక్కుతుంది.

ఈ రెండు ప్లాన్‍లతో వీ మూవీస్, టీవీ సబ్‍స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

అయితే, వొడాఫోన్‍ ఐడియా నుంచి ఇప్పటికే లభిస్తున్న రూ.3,099 ప్లాన్ (Vi 3099 Prepaid Plan) ఆకర్షణీయంగా ఉంది. ఈ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. ప్రతీ రోజు 2జీబీ డేటా, అన్‍లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‍లు లభిస్తాయి. డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‍స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. బింజ్ ఆల్‍నైట్, వీకెండ్ డేటా రోల్ఓవర్, డేటా డిలైట్ ప్రయోజనాలు పొందవచ్చు. కాస్త ధర ఎక్కువైనా.. సంవత్సరం ప్లాన్ తీసుకోవాలనుకునే వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు ఈ ప్లాన్ సూటవుతుంది.

Whats_app_banner

టాపిక్