Jeep Grand Cherokee Price: జీప్ గ్రాండ్ చెరోకీ ధర పెంపు: వివరాలివే-jeep grand cherokee gets price hike check new price and details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Jeep Grand Cherokee Gets Price Hike Check New Price And Details

Jeep Grand Cherokee Price: జీప్ గ్రాండ్ చెరోకీ ధర పెంపు: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 13, 2023 10:41 AM IST

Jeep Grand Cherokee Price Hike: జీప్ గ్రాండ్ చెరోకీ ఫ్లాగ్‍షిప్ ఎస్‍యూవీ ధర పెరిగింది. ఈ ఎస్‍యూవీ ధరను రూ.లక్ష పెంచింది జీప్.

Jeep Grand Cherokee Price: జీప్ గ్రాండ్ చెరోకీ ధర పెంపు: వివరాలివే
Jeep Grand Cherokee Price: జీప్ గ్రాండ్ చెరోకీ ధర పెంపు: వివరాలివే (HT Auto)

Jeep Grand Cherokee Price Hike: ఫ్లాగ్‌షిప్ ఎస్‍యూవీ గ్రాండ్ చెరోకీ ధరను జీప్ ఇండియా పెంచింది. దీంతో ఈ ప్రీమియమ్ కారు మరింత ప్రియంగా మారింది. గత నవంబర్‌లో ఈ ఎస్‍యూవీ లాంచ్ కాగా.. నాలుగు నెలలు ముగియకుండానే ధరను రూ.లక్ష అధికం చేసింది జీప్. దీంతో జీప్ గ్రాండ్ చెరోకీ ధర ఇండియాలో రూ.78.50 లక్షల (ఎక్స్-షోరూమ్)కు చేరింది. లాంచ్ అయిన సమయంలో ఇది రూ.77.50లక్షలుగా ఉండేది. గ్రాండ్ చెరోకీ ధరను రూ.లక్ష పెంచిన జీప్.. పవర్‌ట్రైన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్‍యూవీ వివరాలివే.

ట్రెండింగ్ వార్తలు

జీప్ గ్రాండ్ చెరోకీ ఇంజిన్

Jeep Grand Cherokee Powertrain: జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్‍యూవీ 2.0-లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‍ను కలిగి ఉంది. 268 bhp గరిష్ట పవర్ , 400 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేయగలదు. 8-స్పీడ్ టార్క్యూ కన్వర్టర్ ఉంటుంది. క్వాడ్రాటాక్ (Quadratac) 4x4 సిస్టమ్ ద్వారా నాలుగు వీల్‍లకు పవర్ చేరుతుంది.

ఏడు స్లాట్ల ఫ్రంట్ గ్రిల్, క్లామ్‍షెల్ బొనెట్, బాక్సీ సిల్హొయెట్‍తో జీప్ గ్రాండ్ చెరోకీ.. డిజైన్‍పరంగా ఆకర్షణీయంగా ఉంది. జీప్‍ లుక్‍ను ఇస్తుంది. 20 ఇంచుల అలాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది.

Jeep Grand Cherokee: ఫీచర్లు

యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ సపోర్టుతో కూడిన 10.2 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్‍ను ఈ జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్‍యూవీ కలిగి ఉంది. డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ కన్సోల్, పనోరామిక్ సన్‍‍రూఫ్‍తో వస్తోంది. ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ప్రత్యేకమైన డిస్‍ప్లే ఉంటుంది. కాప్రి లెదర్‍తో సీట్లు ఉంటాయి. వెంటిలెటెట్ ఫ్రంట్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్, వాయిస్ కమాండ్, 9-స్పీకర్ ఆడియో సిస్టమ్, హెడ్ అప్ డిస్‍ప్లే యూనిట్‍ను గ్రాండ్ చెరోకీ కారు కలిగి ఉంది.

ఎనిమిది ఎయర్ బ్యాగ్స్, ఈబీడీతో ఏబీఎస్, టీసీఎస్, ఈఎస్‍సీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, టీపీఎంఎస్, ఏడీఏఎస్ సెఫ్టీ ఫీచర్లను Jeep Grand Cherokee SUV కలిగి ఉంది. ఫైవ్ సీటర్‌గా ఇది అందుబాటులో ఉంది.

జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్‍యూవీకి ఆడి క్యూ7, మెర్సెడెస్ బెంజ్ జీఎల్ఈ, వోల్వో ఎక్స్‌సీ90, బీఎండబ్ల్యూ ఎక్స్5 పోటీగా ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం