DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మార్చిలో డీఏ పెంపు; హైక్ ఎంత అంటే..?-is da hike in march dearness allowance for central staff to be over 50 pc of basic salary ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Da Hike: ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మార్చిలో డీఏ పెంపు; హైక్ ఎంత అంటే..?

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మార్చిలో డీఏ పెంపు; హైక్ ఎంత అంటే..?

HT Telugu Desk HT Telugu
Feb 28, 2024 04:56 PM IST

DA Hike in March: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త. మార్చి నెలలో వారి కరువు భత్యం పెంపు పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందని సమాచారం. డీఏ ను కనీసం 4 శాతం పెంచుతూ కేంద్రం ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Bloomberg)

DA Hike in March: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2024 మార్చిలో నాలుగు శాతం కరువు భత్యం (DA) పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రతి నెలా లేబర్ బ్యూరో విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (CPI-IW) ఆధారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం లెక్కిస్తారు.

ఏడవ పే కమిషన్

7వ కేంద్ర వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములా ప్రకారమే ఈ డీఏ పెంపు ఉంటుంది. 2023 అక్టోబర్లో చివరిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ను, పెన్షనర్లకు డీఆర్ ను నాలుగు శాతం పెంచారు. ఆ నాలుగు శాతం పెంపుతో డీఏ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. తాజా నిర్ణయంతో 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి స్థాయి అధికారులకు దీపావళి బోనస్ లను ప్రభుత్వం ఆమోదించింది. 2022-2023 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (అడ్ హాక్ బోనస్) లెక్కింపునకు రూ.7,000 పరిమితిని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించింది.

50 శాతం దాటుతుందా?

ఒకవేళ, కేంద్ర ప్రభుత్వం 4% డీఏ ప్రకటిస్తే, డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్ (DR) 50 శాతం దాటిపోతుంది. డీఏ పెంపు వినియోగదారుల ధరల సూచిక (Consumer Price Index CPI) డేటాపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, 12 నెలల సగటు డేటా 392.83గా ఉంది. ఈ గణాంకాల ఆధారంగా, డిఎ ప్రాథమిక వేతనంలో 50.26 శాతాన్ని సూచిస్తుంది.

ప్రతీ ఆరు నెలలకు ఒకసారి

పారిశ్రామిక కార్మికుల కోసం సీపీఐ (CPI for Industrial Workers (CPI-IW) డేటాను నెలవారీగా కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న లేబర్ బ్యూరో ప్రచురిస్తుంది. సాధారణంగా, DA, DR లను ప్రతీ జనవరి, జులై నెలలలో, అంటే ప్రతీ ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. మార్చి నెలలో ప్రభుత్వం ప్రకటిస్తుందని భావిస్తున్న 4% డీఏ పెంపు జనవరి 1, 2024 నుండి వర్తించే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్లు గడిచిన నెలలకు బకాయిలను అందుకుంటారు.

Whats_app_banner