iPhone 14, iPhone 14 Plus: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఎల్లో కలర్ వేరియంట్ ప్రీ-బుకింగ్: డిస్కౌంట్లతో..
iPhone 14 iPhone 14 Plus Yellow Colour: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఎల్లో కలర్ వేరియంట్ ప్రీ-బుకింగ్ మొదలైంది. ఈ సందర్భంగా కొన్ని ప్లాట్‍ఫామ్‍ల్లో డిస్కౌంట్‍తో ఈ కొత్త కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది.
iPhone 14 iPhone 14 Plus Yellow Colour: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మొబైళ్లకు ఎల్లో కలర్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త కలర్ ఆప్షన్ ప్రీ-బుకింగ్ మొదలైంది. కొనుగోలు చేయాలనుకున్న వారు ఇప్పుడు ప్రీ-బుక్ చేసుకోవచ్చు. గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ మొబైళ్లకు ఇప్పుడు ఎల్లో కలర్ వేరియంట్ యాడ్ అయింది. ప్రీ-బుకింగ్ సందర్భంగా లాంచ్ ధర కంటే డిస్కౌంట్‍లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఎల్లో కలర్ ఆప్షన్ లభిస్తోంది. పూర్తి వివరాలివే..
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఎల్లో వేరియంట్ ధర, ఆఫర్లు
iPhone 14 iPhone 14 Plus Yellow Colour: ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఎల్లో కలర్ వేరియంట్ ప్రీ-బుకింగ్ మొదలైంది. ఎల్లో కలర్ వేరియంట్ ఐఫోన్ 14 (128 జీబీ) ప్రారంభ ధర రూ.79,990, ఐఫోన్ 14 ప్లస్ (128 జీబీ) ప్రారంభ ధర రూ.89,990గా ఉన్నాయి. యాపిల్ ఆన్‍లైన్ స్టోర్‌లో ఈ ధరకు లభిస్తున్నాయి. అయితే, ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‍కార్ట్, అమెజాన్‍లో ఈ ఎల్లో కలర్ వేరియంట్ ఐఫోన్ 14 128జీబీ మోడల్ రూ.72,999కే ప్రీ-ఆర్డర్‌కు డిస్కౌంట్‍తో లభిస్తోంది. ఈ ప్లాట్‍ఫామ్‍ల్లో ఐఫోన్ 14 ప్లస్ ఎల్లో 128జీబీ ప్రారంభ ధర రూ.81,999గా ఉంది. బ్యాంక్ కార్డు ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
ఇక యాపిల్ ఆఫ్‍లైన్ స్టోర్లలో స్టోర్ డిస్కౌంట్లు, ఇన్‍స్టంట్ క్యాష్‍బ్యాక్స్, పాత ఐఫోన్ ఎక్స్చేంజ్ లాంటి ఆఫర్లు వినియోగించుకొని ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఎల్లో కలర్ వేరియంట్‍పై రూ.15వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. ఈ ఎల్లో కలర్ వేరియంట్ల ఓపెన్ సేల్ ఈనెల 14వ తేదీన ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఈ మొబైళ్లు స్టార్ లైట్, పర్పుల్, మిడ్‍నైట్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తున్నాయి.
iPhone 14: ఐఫోన్ 14 మొబైల్ 6.1 ఇంచుల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‍ప్లేను కలిగి ఉంది. యాపిల్ బయోనిక్ ఏ15 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఐఓఎస్ 16తో వస్తోంది. ఈ ఫోన్ వెనుక 12 మెగాపిక్సెల్ (MP) ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
iPhone 14 Plus: 6.7 ఇంచుల సూపర్ రెటీనా XDR OLEDడిస్‍ప్లేతో ఐఫోన్ 14 ప్లస్ వస్తోంది. ఈ ఫోన్ వెనుక 12 MP ప్రైమరీ, 12 MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉంటాయి. 12 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ మొబైల్‍లో కూడా యాపిల్ బయోనిక్ ఏ15 ప్రాససెర్ ఉంటుంది. ఐఫోన్ 14, 14 ప్లస్ ఫోన్లు 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తున్నాయి.