iPhone 14: అతి తక్కువ ధరకే ఐఫోన్ 14; 34 వేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు
iPhone 14: ఐ ఫోన్ (iPhone) లవర్స్ కు శుభవార్త. ఐఫోన్ సిరీస్ లో లేటెస్ట్ మోడల్ ఐ ఫోన్ 14 (iPhone 14) ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకే లభిస్తోంది.
ఐ ఫోన్ 14 (iPhone 14) భారత్ లో 2022 సెప్టెంబర్ లో లాంచ్ అయింది. ప్రస్తుతం iPhone 14 (iPhone 14) మార్కెట్ ధర (MRP) రూ. 79,900 గా ఉంది. కానీ, వివిధ ఆఫర్లను ఉపయోగించుకుని ఆ ఫోన్ ను ఇప్పుడు రూ. 34,000 కే పొందవచ్చు. ఎలాగో ఇక్కడ చూడండి..
How to get iPhone 14 for ₹34,000?: ఇలా చేస్తే రూ. 34 వేలకే ఐఫోన్ 14
ఐఫోన్ 14 (iPhone 14) ను రూ. 34 వేలకే కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా భారత్ లో యాపిల్ ఆథరైజ్డ్ రీ సెల్లర్ అయిన యూనీకార్న్ స్టోర్ (Unicorn Store) అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఆ వెబ్ సైట్ లో ఐఫోన్ 14 (iPhone 14) ధర రూ. 69,513 గా ఉంది. అంటే, ఇప్పటికే ఎమ్మార్పీపై (MRP) సుమారు 13% (రూ.10,387 ) డిస్కౌంట్ లభించింది. ఆ తరువాత మీరు మీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) కార్డుతో పేమెంట్ చేస్తే, అదనంగా మీకు రూ. 4000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆ డిస్కౌంట్ తరువాత ఐఫోన్ 14 (iPhone 14) ధర రూ. 65,513 కి చేరుతుంది.
iPhone 14: ఓల్డ్ ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే..
ఆ తరువాత, మీ వద్ద, వర్కింగ్ కండిషన్ లో ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 25 వేల వరకు ధర తగ్గుతుంది. అంటే, మీ పాత ఫోన్ (old phone) కు గరిష్ట ఎక్స్ చేంజ్ విలువ లభిస్తే, మీరు కొనబోయే ఐఫోన్ 14 (iPhone 14) ధర రూ. 25 వేలు తగ్గి చివరకు రూ. 40,513 కి చేరుతుంది. అంతేకాకుండా, మీకు అదనంగా మరో రూ. 6000 ఎక్స్ చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఎక్స్ చేంజ్ డిస్కౌంట్ (exchange discount) తో కొత్త ఐ ఫోన్ 14 (iPhone 14) ధర రూ. 34,513 కి చేరుతుంది. అంటే, మొత్తంగా ఐఫోన్ 14 (iPhone 14) పై మీకు రూ. 45,387 (54%) డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, మీరు ఎక్స్ చేంజ్ చేస్తున్న ఫోన్ కంపెనీ, మోడల్, వర్కింగ్ కండిషన్ లపై ఆధారపడి ఎక్స్ చేంజ్ అమౌంట్ లభిస్తుంది.
టాపిక్