iPhone 12 price drop : ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​.. ఇంతకన్నా బెస్ట్​ ఆఫర్​ ఉండదు!-iphone 12 price cut grab the discount before it ends ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 12 Price Drop : ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​.. ఇంతకన్నా బెస్ట్​ ఆఫర్​ ఉండదు!

iPhone 12 price drop : ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​.. ఇంతకన్నా బెస్ట్​ ఆఫర్​ ఉండదు!

Sharath Chitturi HT Telugu
Nov 13, 2023 06:18 PM IST

iPhone 12 price drop : ఫ్లిప్​కార్ట్​లో ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ఆ వివరాలు..

ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​..
ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​.. (Amazon)

iPhone 12 price drop : దీపావళి అయిపోయింది- కానీ సీజన్​ సేల్స్​ హడావుడి ఇంకా కొనసాగుతోంది. టీవీలు, స్మార్ట్​ఫోన్స్​, వాచ్​లతో పాటు అనేక పరికరాలపై ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్​ ఇస్తున్నాయి ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థలు. ఇక ఇప్పుడు.. ఐఫోన్​ 12పై భారీ డిస్కౌంట్​ని ప్రకటించింది ఫ్లిప్​కార్ట్​ సంస్థ. వీటితో పాటు బ్యాంక్​ కార్డ్​లు, ఎక్స్​ఛేంజ్​ ఆఫర్స్​ కూడా ఉండటంతో.. ఈ మోడల్​ ధర మరింత దిగొస్తుంది. ఆ వివరాలు..

ఐఫోన్​ 12 ప్రైజ్​ కట్​..

ఐఫోన్​ 12 కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఇదే రైట్​ టైమ్​! 64జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధరపై భారీ తగ్గింపును ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. ఫలితంగా.. ఐఫోన్​ 12ని ఇప్పుడు రూ. 39,999కే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ యాపిల్​ స్మార్ట్​ఫోన్​ వాస్తవ ధర రూ. 49,900. అంటే.. ఈసారి ఏకంగా 19శాతం డిస్కౌంట్​ లభిస్తున్నట్టే!

iPhone 12 price cut : ఇక ఈ మోడల్​పై ఇతర ఆఫర్స్​ కూడా ఇస్తోంది ఈ-కామర్స్​ సంస్థ. ఫ్లిప్​కార్ట్​ యాక్సిస్​ బ్యాంక్​ కార్డుపై 5శాతం క్యాష్​బ్యాక్​ని ఇస్తోంది. ఎక్స్​ఛేంజ్​ ఆఫర్​ కింద రూ. 35వేల వరకు సేవ్​ చేసుకోవచ్చు. కాకపోతే.. ఈ ఆఫర్​ అనేది మీరు ఎక్స్​ఛేంజ్​ చేస్తున్న డివైజ్​ ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా.. ఈ ఆప్షన్​ మీ లొకేషన్​లో అందుబాటులో ఉందో లేదో కూడా చూసుకోవాలి.

ఐఫోన్​ 12 ఫీచర్స్​ ఇవే..

ఐఫోన్​ 12లో 6.1 ఇంచ్​ సూపర్​ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లే ఉంటుంది. 12ఎంపీ డ్యూయెల్​ లెన్స్​ సిస్టెమ్​, 12ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ వస్తుంది. ఏ14 బయోనిక్ ​ప్రాసెసర్​ దీని సొంతం. సెరామిక్​ షీల్డ్​ టెక్నాలజీ ఇందులో ఉంటుంది. ఐపీ68 వాటర్​ రెసిస్టెన్స్​ సపోర్ట్​ ఉంటుంది. కొత్తగా లాంచ్​ అయిన ఐఓఎస్​ 17 సాఫ్ట్​వేర్​ సపోర్ట్​ దీనికి లభిస్తుండటం విశేషం.

ఐఫోన్​ 15 పాస్​కోడ్​ మర్చిపోయారా?

offers on iPhone 12 : సెక్యూరిటీ పరంగా ఐఫోన్ మిగతా స్మార్ట్​ఫోన్స్ కన్నా చాలా పై స్థాయిలో ఉంటుంది. కానీ, ఐఫోన్ పాస్‌కోడ్‌ను మరచిపోతే అది పీడకలలా మారుతుంది. ఆ పాస్​కోడ్​ను మళ్లీ పొందడం దాదాపు అసాధ్యమనే భావనలో చాలా మంది ఉంటారు. కానీ అది నిజం కాదు. సింపుల్ స్టెప్స్ తో ఐఫోన్ పాస్​కోడ్​ను తిరిగి పొందవచ్చు. మీరు ఇటీవలే ఐఫోన్​ 15ని కొనుగోలు చేసి, మీ పాస్‌కోడ్‌ను మరచిపోయినట్లయితే భయపడవద్దు. కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.. మీ ఐఫోన్ 15ని అన్​లాక్ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం