IOC Q3 results: క్యూ 3 లో ఐఓసీకి భారీ లాభాలు; 8,063 కోట్లకు చేరిన నికర లాభాలు-ioc q3 results oil major reports massive jump in net profit at 8 063 cr rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ioc Q3 Results: క్యూ 3 లో ఐఓసీకి భారీ లాభాలు; 8,063 కోట్లకు చేరిన నికర లాభాలు

IOC Q3 results: క్యూ 3 లో ఐఓసీకి భారీ లాభాలు; 8,063 కోట్లకు చేరిన నికర లాభాలు

HT Telugu Desk HT Telugu
Jan 24, 2024 07:15 PM IST

IOC Q3 results: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY24) ఫలితాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

IOC Q3 results: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY24) లో భారీ వృద్ధిని నమోదు చేసింది. 2023-24 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ స్టాండలోన్ నికర లాభాలు రూ.8,063.39 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.448.01 కోట్ల లాభంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కాగా, సెప్టెంబర్ తో ముగిసిన మూడు నెలల త్రైమాసికంలో (Q2FY24) సంస్థ సాధించిన ఆదాయం అయిన రూ.12,967.32 కోట్లతో పోలిస్తే ఇది కొంత తక్కువ.

ఆదాయం పెరిగింది..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆపరేషన్స్ రెవెన్యూ ఈ క్యూ 3 లో రూ. 2.23 ట్రిలియన్లుగా నమోదైంది. ఇది గత సంవత్సరం క్యూ 3 లో సంస్థ సంపాదించిన ఆపరేషన్స్ రెవెన్యూ అయిన రూ. 2.28 ట్రిలియన్ తో పోలిస్తే కొంత తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పెట్రోలియం ఉత్పత్తుల విక్రయం ద్వారా ఇండియా ఆయిల్ ఆదాయం రూ.11,428.88 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది రూ.1,541.95 కోట్లుగా మాత్రమే ఉంది. క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోవడం ఐఓసీ ఆదాయం పెరగడానికిి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ఈ ఆర్థిక సంవత్సరంలో..

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి ఇంధనాలను తయారు చేయడానికి ఎక్కువగా దిగుమతి చేసుకున్న ముడి చమురును తన రిఫైనరీలలో ఉపయోగిస్తుంది. వీటిని దాని విస్తారమైన పెట్రోల్ పంపులు మరియు ఎల్పిజి పంపిణీ ఏజెన్సీల ద్వారా విక్రయిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) ఇండియన్ ఆయిల్ రూ.34,781.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది 2021-22లో కంపెనీ నమోదు చేసిన అత్యధిక నికర లాభం కంటే కూడా ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వచ్చిన లాభం "ప్రధానంగా అధిక మార్కెటింగ్ మార్జిన్ మరియు తక్కువ మారకం నష్టాల కారణంగా" ఎక్కువగా ఉందని ఐఓసి ఒక ప్రకటనలో తెలిపింది. 2023 ఏప్రిల్-డిసెంబర్లో ప్రతి బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా 13.26 డాలర్లు ఆర్జించినట్లు ఐఓసీ తెలిపింది. కాగా, ఫలితాల ప్రకటనకు ముందు షేర్ మార్కెట్లో ఐఓసీ షేరు ధర 3.24 శాతం పెరిగి రూ.143.45 వద్ద ముగిసింది.

Whats_app_banner