Infinix New 5G Phone: ఇన్ఫినిక్స్ కొత్త 5జీ ఫోన్ లాంచ్ డేట్ ఖరారు.. బడ్జెట్ రేంజ్‍లోనే! ల్యాప్‍టాప్ కూడా..
Infinix Zero 5G 2023: ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 లాంచ్ డేట్ ఖరారైంది. ఈ ఫోన్‍కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, అంచనా ధర కూడా ఇప్పటికే బయటికి వచ్చాయి.
Infinix Zero 5G 2023: ఇన్ఫినిక్స్ (Infinix) బ్రాండ్ ఇండియాలో మరో 5జీ మొబైల్ లాంచ్ చేయనుంది. ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 మోడల్‍ను విడుదల చేయనుంది. ఇప్పటికే ఉన్న జీరో 5జీ మొబైల్‍కు అప్‍గ్రేడ్‍లతో ఈ 2023 వెర్షన్‍ను తీసుకురానుంది. ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 ఫోన్‍ను ఫిబ్రవరి 4వ తేదీన భారత మార్కెట్‍లో లాంచ్ చేయనున్నట్టు ఇన్ఫినిక్స్ ప్రకటించింది. ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా ల్యాప్‍టాప్‍ను కూడా తీసుకురానున్నట్టు పేర్కొంది. ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 వివరాలు ఇవే.
లాంచ్ వివరాలు
Infinix Zero 5G 2023: ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 ఫోన్‍ను ఫిబ్రవరి 4వ తేదీన భారత్‍లో లాంచ్ చేయనున్నట్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ సంస్థ ప్రకటించింది. ఇందుకోసం ఓ టీజర్‌ను కూడా పోస్ట్ చేసింది. ఈ సెగ్మెంట్‍లో ఫాస్టెస్ట్ 5జీ ఫోన్ అంటూ టీజ్ చేసింది. కాగా, ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 ఫోన్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌లో అందుబాటులోకి వస్తుంది. కాగా, ఇన్ఫినిక్స్ జీరో బుక్ అల్ట్రా ల్యాప్‍టాప్ లాంచ్ డేట్‍ను వెల్లడించలేదు. కమింగ్ సూన్ అంటూ పేర్కొంది.
Infinix Zero 5G 2023: ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 మొబైల్ ఇప్పటికే కొన్ని దేశాల్లో విడుదలైంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు తెలిసిపోయాయి. మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్ ఈ ఫోన్‍లో ఉంటుంది. గరిష్ఠంగా 256జీబీ స్టోరేజ్‍తో వస్తోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండే ఫుల్ హెచ్‍డీ+ 6.78 ఇంచుల డిస్‍ప్లేను ఈ మొబైల్ కలిగి ఉంటుంది.
ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 మొబైల్‍లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. వెనుక మూడు కెమెరాలు ఉంటాయి. అందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాగా ఉంటుంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది.
ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 ధర
Infinix Zero 5G 2023 Price: 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఉన్న ఇన్ఫినిక్స్ జీరో 5జీ 2023 ధర గ్లోబల్ మార్కెట్‍లో 239డాలర్లు (సుమారు రూ.19,400)గా ఉంది. ఇండియాలోనూ ఈ ఫోన్ ధర రూ.20వేలలోపే ఉంటుంది.
కాగా, ఇన్ఫినిక్స్ నోట్ 12ఐ ఫోన్‍ను ఇండియాలో ఈనెల 25న ఆ సంస్థ విడుదల చేయనుంది. ఇది బడ్జెట్ రేంజ్‍లో 4జీ మొబైల్‍గా అడుగుపెట్టనుంది.
సంబంధిత కథనం