Cars Discount : ఈ ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్.. మీకు నచ్చే కారుపై రూ.2.5 లక్షల తగ్గింపు!-huge discount on these suvs get up to 2 5 lakh rupees discount mahindra thar skoda kushaq ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cars Discount : ఈ ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్.. మీకు నచ్చే కారుపై రూ.2.5 లక్షల తగ్గింపు!

Cars Discount : ఈ ఎస్‌యూవీలపై భారీ డిస్కౌంట్.. మీకు నచ్చే కారుపై రూ.2.5 లక్షల తగ్గింపు!

Anand Sai HT Telugu

Cars Discount : కారు తీసుకోవాలి అనుకునేవారికి ఇది రైట్ టైమ్. కొన్ని కార్లపై పండుగ ఆఫర్‌లో భాగంగా భారీ తగ్గింపులు ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

Maruti Suzuki Jimny: ఈ మారుతి సుజుకీ జిమ్నీ ని ప్రీమియం నెక్సా రిటైల్ నెట్ వర్క్ ద్వారానే అమ్మనున్నారు. ఈ కారు మార్కెట్లో ప్రధానంగా మహింద్ర థార్, ఫోర్స్ గూర్ఖాలకు పోటీగా నిలవనుంది.

కారు కొనాలి అనుకుంటే పండుగ సీజన్‌ సరైన సమయం. ఎందుకంటే భారీ డిస్కౌంట్ల ప్రకటిస్తాయి కంపెనీలు. ప్రముఖ కంపెనీల కార్లు తగ్గింపు ధరతో వస్తాయి. ఈ పండుగ సీజన్‌లో దేశంలోని అనేక సూపర్ కార్లు మంచి తగ్గింపులతో అమ్ముడవుతున్నాయి. మహీంద్రా థార్ టూ మారుతి సుజుకి జిమ్నీ ఈ లిస్టులో ఉన్నాయి. రూ.2.5 లక్షల వరకు ప్రయోజనాలు దొరుకుతాయి. ఈ వివరాలపై ఓ లుక్కేద్దాం..

స్కోడా కుషాక్

స్కోడా రూ. 2.5 లక్షల వరకు ప్రయోజనాలతో కుషాక్‌ను విక్రయిస్తోంది. 2 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన పాత మోడల్ కుషాక్‌పై ఈ తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. స్కొడా కుషాక్ సేఫ్టీ పరంగా మంచి ఎస్‌యూవీగా ఉంది. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా తెచ్చుకుంది. ఎస్‌యూవీల సెగ్మెంట్లో ప్రముఖ బ్రాండ్‌లతో పోటీ పడుతుంది.

మహీంద్రా థార్ రాక్స్

థార్ రాక్స్‌ను ఇటీవల విడుదలైంది. ఈ 5-డోర్ల ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ డెలివరీ ప్రారంభమైంది. అదే సమయంలో థార్ 3-డోర్ వెర్షన్ ఇప్పుడు గొప్ప తగ్గింపులతో అమ్ముతున్నారు. మీరు మహీంద్రా థార్ రాక్స్ కొనుగోలుపై మొత్తం రూ. 1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. కంపెనీ తన పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌పై రూ.1.25 లక్షల తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు రూ.25 వేల విలువైన యాక్ససరీలను కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ కారు సేల్‌లోకి రాగానే మంచి బుకింగ్స్ సంపాదించింది.

మారుతి సుజుకి జిమ్నీ

మారుతి సుజుకి జిమ్నీ 2023 ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేశారు. ఇది మెుదటి నుంచి పెద్దగా కస్టమర్లను ఆకర్శించలేదని చెప్పొచ్చు. ఈ కారణంగానే కంపెనీ ఎప్పటికప్పుడు ఆఫర్లను ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పండుగ సీజన్‌లో జిమ్నీ ఎంపిక చేసిన వేరియంట్‌ల కొనుగోలుపై రూ. 2.5 లక్షల వరకు ఆదా చేయవచ్చు. జీటా వేరియంట్‌ను రూ. 1.95 లక్షల తగ్గింపుతో విక్రయిస్తుంది. అలాగే ఆల్ఫా వేరియంట్ రూ. 2.5 లక్షల తగ్గింపుతో అమ్ముతుంది.