Hero XPulse 200 4V : సరికొత్త హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ.. వచ్చేస్తోంది!
Hero XPulse 200 4V : హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ అప్డేటెడ్ వర్షెన్కు సంబంధించిన టీజర్‌ను సంస్థ విడుదల చేసింది. సరికొత్తగా ఈ బైక్ మార్కెట్లోకి వస్తున్నట్టు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.
Hero XPulse 200 4V : హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ బైక్‌కు అప్డేటెడ్ వర్షెన్‌ను తీసుకొస్తోంది ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. త్వరలోనే ఇది లాంచ్ అవుతgxదని తెలుస్తోంది. కాగా ఈ బైక్‌కు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేసింది ఆ సంస్థ.
చాలా మార్పులే జరిగాయి..!
టీజర్‌ను చూస్తుంటే.. ఈ హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ సరికొత్తగా అడుగుపెట్టనున్నట్టు కనిపిస్తోంది. ఈ బైక్‌లోని ఎల్ఈడీ హెడ్‌లైట్‌ను రీడిజైన్ చేశారు. రోడ్, ఆఫ్- రోడ్, ర్యాలీ వంటి మోడ్స్.. డిజిటల్ క్లస్టర్‌కు రైట్ సైడ్‌లో కనిపిస్తున్నాయి. ప్రస్తుత మోడల్లో సింగిల్ ఛానెల్ ఏబీస్ మాత్రమే ఉంది. అప్డేటెడ్ వర్షెన్‌లో డ్యూయెల్ ఛానెల్ ఏబీస్ వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా రైడింగ్ మోడ్ మరింత మెరుగుపడొచ్చు. ఇక రోడ్ మోడ్‌కు డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ ఉంటుందని, ఆఫ్- రోడ్ మోడ్‌లో ఏబీఎస్ మొత్తానికే స్విచ్చాఫ్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. ర్యాలీ మోడ్‌లో అసలు ఏబీఎస్ ఉండదని సమాచారం. దీనిపై సంస్థ ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
Hero XPulse 200 4V on road price Hyderabad : అప్డేటెడ్ హీరో ఎక్స్‌పల్స్ 200 4వీలో కొత్త కలర్ ఆప్షన్స్ కూడా వస్తాయని అంచనాలు ఉన్నాయి. ఇందులో 199.6సీసీ ఎయిర్/ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఉండనుంది. ఇది 19.1 హెచ్‌పీ పవర్‌ను, 17.35 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇదీ చూడండి:- Hero Motocorp dividend: రూ. 35 డివిడెండ్ ప్రకటించిన హీరో మోటో కార్ప్
ఇక ప్రైజ్ విషయానికొస్తే.. ప్రస్తుత మోడల్ కన్నా అప్డేటెడ్ వర్షెన్ ధర కాస్త ఎక్కువే ఉండొచ్చు. మర్కెట్లో ప్రస్తుత మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,38,766గా ఉంది.
ఈ బైక్ లాంచ్, ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది.
2023 కేటీఎం 390 అడ్వెంచర్ లాంచ్..
390 అడ్వెంచర్ 2023 వర్షెన్‌ను లాంచ్ చేసింది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కేటీఎం. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధర రూ. 3.60లక్షలుగా ఉంది. 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ వేరియంట్లతో పాటు 2023 కేటీఎం 390 అడ్వెంచర్‌ని విక్రయించనున్న సంస్థ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం