Hero Bikes, Scooters: పెరగనున్న హీరో బైక్‍లు, స్కూటర్ల ధరలు.. ఎప్పటి నుంచి? ఎందుకు?-hero motorcycles and scooters price set to rise from april 1 why ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Bikes, Scooters: పెరగనున్న హీరో బైక్‍లు, స్కూటర్ల ధరలు.. ఎప్పటి నుంచి? ఎందుకు?

Hero Bikes, Scooters: పెరగనున్న హీరో బైక్‍లు, స్కూటర్ల ధరలు.. ఎప్పటి నుంచి? ఎందుకు?

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 23, 2023 11:26 AM IST

Hero Bikes, Scooters Price Hike: హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన బైక్‍లు, స్కూటర్ల ధర పెరగనుంది. 2 శాతం వరకు అధికం కానుంది. పూర్తి వివరాలు ఇవే.

Hero Bikes, Scooters: పెరగనున్న హీరో బైక్‍లు, స్కూటర్ల ధరలు
Hero Bikes, Scooters: పెరగనున్న హీరో బైక్‍లు, స్కూటర్ల ధరలు (HT Auto)

Hero Bikes, Scooters Price Hike: హీరో బైక్ (Motorcycles) లేదా స్కూటర్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు ఇప్పటి కంటే కాస్త ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి హీరో బైక్‍లు, స్కూటర్ల ధరలు పెరగనున్నాయి. దేశంలోనే అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) బైక్‍లు, స్కూటర్ల ధరలను పెంచేందుకు రెడీ అయంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సుమారు 2శాతం వరకు రేట్లు పెరగనున్నాయి. ఇందుకు కారణాన్ని కూడా హీరో సంస్థ వెల్లడించింది.

ధరల పెంపు ఇందుకే..

Hero Bikes, Scooters Price Hike: నూతన ఉద్గార ప్రమాణాలైన ‘భారత్ స్టేజ్ 6 (BS6) ఫేజ్ 2’, RED ఫ్యుయెల్ రెగ్యులేషన్లకు అనుగుణంగా అన్ని మోడళ్లను అప్‍డేట్ చేస్తున్నామని, అందుకే ధరను పెంచాలని నిర్ణయించుకున్నట్టు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. కొత్త ప్రమాణాల ప్రకారం అన్ని బైక్‍లు, స్కూటర్లలోనూ ఆన్-బోర్డ్ డయాగ్నిస్టిక్స్ (OBD-2) వ్యవస్థను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వాహనాల తయారీ ఖర్చు పెరుగుతుంది. అందుకే దానికి అనుగుణంగా ధరలను పెంచనున్నట్టు ఎక్స్చేంజ్ ఫిల్లింగ్‍లో హీరో తెలిపింది.

ఉద్గారాల స్థాయి (Emission Levels)ని ఎప్పటికప్పుడు తెలిపేలా OBD 2 వ్యవస్థ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే అన్ని వాహనాల్లో ఉండాలి. ఈ నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. కాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్లు లాంటి పరికరాలు ఈ ఓబీడీ-2 డివైజ్‍లో ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు ఉద్గారాల స్థాయిని చెక్ చేస్తుంటాయి.

కస్టమర్లు కాస్త ధర పెంపు భారాన్ని భరించకతప్పని హీరో మోటోకార్ప్ తెలిపింది. అయితే ఏఏ మోడళ్లపై ఎంత ధరను పెంచుతున్నది ఇప్పటికి సష్టంగా చెప్పలేదు. 2 శాతం వరకు ధర పెంపు ఉంటుందని మాత్రమే పేర్కొంది. మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను మారుస్తామని ఆ సంస్థ ప్రకటించింది. నిర్దిష్టమైన మోడల్స్, మార్కెట్‍ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.

టాటా మోటార్స్, కియా సహా మరికొన్ని కార్ల తయారీ కంపెనీలు కూడా ధర పెంపును ప్రకటించాయి. కొత్త ఉద్గారాల ప్రమాణాలకు అనుగుణంగా RDE ఇంజిన్లను ఏర్పాటు చేయాల్సి రానుడటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. RDE ఏర్పాటు కారణంగా ఇన్‍పుట్ కాస్ట్ పెరగనుండటంతో రేట్లను అధికం చేయనున్నాయి.

ఈ ఏడాది హీరో లాంచ్ చేసిన జూమ్ (Hero Xoom) స్కూటర్ బాగా సక్సెస్ అయింది. స్పోర్టీ డిజైన్, అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు ఉన్న ఈ 110cc స్కూటర్ అమ్మకాల్లో అదరగొడుతోంది. ఈ స్కూటర్ ప్రారంభ ప్రస్తుతం ధర రూ.68,599(ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.76,699 (ఎక్స్-షోరూమ్) వద్ద ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం