Google Pixel Discount : గూగుల్ పిక్సెల్ 7పై అమేజింగ్ డిస్కౌంట్.. సగం ధరకే ఫోన్.. ఓ లుక్కేయండి!
Google Pixel Discount : గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలను గూగుల్ ఇండియా కొన్నేళ్ల క్రితం లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్లు ఇప్పటికీ ఫ్లిప్ కార్ట్‌లో లిస్ట్ అయి ఉన్నాయి. పిక్సెల్ 9 లాంచ్ తర్వాత వీటి మీద భారీ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఫోన్ ఎంతకు వస్తుంది? ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఆగస్టు 13న గ్లోబల్ అరంగేట్రం చేశాయి. ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా ద్వారా కూడా ఈ స్మార్ట్ ఫోన్ భారత్‌లో లభ్యం కానుంది. కొత్త పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల అమ్మకాలకు గూగుల్ సిద్ధమవుతుండగా అనేక పాత తరం పిక్సెల్ మోడళ్లను నిలిపివేసినట్లు సమాచారం. ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం గూగుల్ అధికారికంగా పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలను నిలిపివేసింది. గూగుల్ పిక్సెల్ 7ఎ, పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో ఫోన్లు అందుబాటులో ఉంటాయని నివేదిక వెల్లడించింది. గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ భారత మార్కెట్లోకి రాలేదు. అయితే పిక్సెల్ 7 ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
గూగుల్ పిక్సెల్ 7 డిస్కౌంట్
రెండు సంవత్సరాల క్రితం భారతదేశంలో లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7 ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయిస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 7 భారతదేశంలో రూ .59,999కు లాంచ్ అయింది. అయితే మీరు బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో పిక్సెల్ 7ను ప్రస్తుతం కేవలం రూ .30,999కు పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 7 ప్రస్తుతం లాంచ్ ధర నుండి రూ .27,000 తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో రూ .32,999 వద్ద జాబితా చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలపై రూ.2000 తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.30,999కు తగ్గింది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.22,950 వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.
గూగుల్ పిక్సెల్ 7 స్పెసిఫికేషన్లు
పిక్సెల్ 7 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.3 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ + అమోలెడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది టెన్సర్ జి 2 చిప్ సెట్‌తో పనిచేస్తుంది. ఎస్ఓసీలో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. పిక్సెల్ 7 ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. కెమెరా విషయానికొస్తే, గూగుల్ పిక్సెల్ 7 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్ ఉన్నాయి. ముందువైపు 10.8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.