Gold and silver prices today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!-gold and silver prices today in hyderabad chennai delhi 28 january 2024 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Gold and silver prices today : స్థిరంగా పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu
Jan 28, 2024 09:14 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా మారలేదు. ప్లాటీనం ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 57,700గా ఉంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,77,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,770గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 62,950గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,29,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,950గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,400గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,710గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,750గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,000గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,700గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లపై అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,600గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 76,000గా ఉంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 77,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,000.. బెంగళూరులో రూ. 73,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సైతం ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 24,400గా ఉంది. ఆ ముందు రోజు కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,400గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం