Gold and silver prices today : షాక్​ ఇస్తున్న పసిడి.. రూ. 62వేలకు చేరువలో బంగారం ధర!-gold and silver prices today 22 march 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Prices Today 22 March 2024 In Telugu States

Gold and silver prices today : షాక్​ ఇస్తున్న పసిడి.. రూ. 62వేలకు చేరువలో బంగారం ధర!

Sharath Chitturi HT Telugu
Mar 22, 2024 05:40 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు శుక్రవారం పెరిగాయి. వెండి ధరలు కూడా వృద్ధి చెందాయి. ప్లాటీనం రేట్లు అత్యంత భారీగా పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (HT_PRINT)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 61,810కి చేరింది. గురువారం ఈ ధర రూ. 61,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,18,100కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,181గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 10 వృద్ధి చెంది.. రూ. 67,430కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 67,420గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 6,74,300గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 61,960గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,580గా ఉంది. ఇక కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 61,830 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 67,430గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 62,360గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 68,030గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 61,810గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 67,430గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 61,810గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 67,430గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 61,860గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 67,480గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 61,810గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 67,430గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేటు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,860గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 78,600గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 78,500గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 81,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 78,600.. బెంగళూరులో రూ. 76,100గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 730 పెరిగి రూ. 24,430కి చేరింది. క్రితం రోజు ధర రూ. 23,700గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,430గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం