Gold and silver prices today : స్వల్పంగా తగ్గిన పసిడి ధర- పెరిగిన వెండి రేటు.. నేటి లెక్కలివే-gold and silver prices today 10 feb 2024 in telugu states chennai delhi ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : స్వల్పంగా తగ్గిన పసిడి ధర- పెరిగిన వెండి రేటు.. నేటి లెక్కలివే

Gold and silver prices today : స్వల్పంగా తగ్గిన పసిడి ధర- పెరిగిన వెండి రేటు.. నేటి లెక్కలివే

Sharath Chitturi HT Telugu
Feb 10, 2024 05:40 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి. ప్లాటీనం రేట్లు పడ్డాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 57,890కి చేరింది. గురువారం ఈ ధర రూ. 57,900గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 5,78,900కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,789గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 తగ్గి.. రూ. 63,150కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 63,160గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి.. రూ. 6,31,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,315గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,040గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,300గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,890 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,150గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,380గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,700గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,890గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,150గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,890గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,150గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,940గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,200గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,890గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,150గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్​బీఐ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు పెరిగాయి..

దేశంలో వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,510గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 75,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 75,000గా ఉండేది.

Silver price today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 76,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 74,400.. బెంగళూరులో రూ. 72,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 300 తగ్గి.. రూ 23,780కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 24,080గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,780గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం