Gold and Silver prices today : గుడ్​ న్యూస్​! భారీగా పడిన బంగారం, వెండి ధరలు..-gold and silver prices today 07 september 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : గుడ్​ న్యూస్​! భారీగా పడిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver prices today : గుడ్​ న్యూస్​! భారీగా పడిన బంగారం, వెండి ధరలు..

Sharath Chitturi HT Telugu
Sep 07, 2024 10:52 AM IST

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు పడ్డాయి. వెండి ధరలు దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు కూడా పతనమయ్యాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం మరింత తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 దిగొచ్చి.. రూ. 66,800కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 67,200గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4000 తగ్గి, రూ. 6,68,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 6,680గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 44 తగ్గి.. రూ. 72,870కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,310గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 440 దిగొచ్చి.. రూ. 7,28,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,287గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,020గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,870గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,800గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,870గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,800గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,870గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,870గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,850గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,920గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,800గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,870గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,450గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 2500 తగ్గి.. రూ. 84,500కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 87,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 89,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 84,500.. బెంగళూరులో రూ. 84,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 20 తగ్గి.. రూ 24,860కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,060గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,860గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం