Go First bankruptcy: ‘గో ఫస్ట్’ ఎయిర్ లైన్స్ దివాళా; పతనం అంచున మరో ఎయిర్ లైన్స్
Go First bankruptcy: మరో ప్రముఖ విమానయాన సంస్థ పతనమైంది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో మూడో స్థానంలో ఉన్న గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ (Go First airlines) దివాళా తీసినట్లు ప్రకటించింది.
Go First bankruptcy: కొరోనా మహమ్మారికి బలైన మరో వ్యాపార సంస్థగా గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ (Go First airlines) నిలిచింది. కోవిడ్ లాక్ డౌన్ తో పాటు, ఇంజిన్ వైఫల్యాలు గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ (Go First airlines) ను భారీగా దెబ్బతీశాయి.
Go First bankruptcy: దివాళా ప్రకటన
ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని, భారీగా ఉన్న రుణాలను తీర్చలేని స్థితిలో ఉన్నామని పేర్కొంటూ గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ (Go First airlines) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (National Company Law Tribunal (NCLT) కు దరఖాస్తు చేసుకుంది. కొరోనా మహమ్మారి కన్నా ముందు గో ఫస్ట్ సంస్థ లాభాల్లోనే ఉంది. నిజానికి, అప్పటికీ లాభాల్లో ఉన్న అతి కొద్ది విమానయాన సంస్థల్లో ‘గో ఫస్ట్ (Go First airlines)’ ఒకటి. సమాన్యులకు కూడా అందుబాటులో ఉండే టికెట్ ధరలతో వినియోగదారులను గో ఫస్ట్ (Go First airlines) ఆకర్షించేది. కానీ, విమాన యాన రంగంపై కొరోనా, లాక్ డౌన్ భారీగా ప్రతికూల ప్రభావం చూపడం, తమ విమానాల ఇంజిన్ల వరుస వైఫల్యం ఈ సంస్థను భారీగా దెబ్బతీశాయి. గత 11 ఏళ్లలో కుప్పకూలిన మూడో పెద్ద విమాన యాన సంస్థగా 'గో ఫస్ట్ (Go First airlines)' నిలిచింది.
Go First bankruptcy: ఇంజిన్లలో వైఫల్యాలతో భారీ నష్టం..
గత ఐదేళ్లుగా వరుస ఇంజిన్ వైఫల్యాలు గో ఫస్ట్ (Go First airlines) ను ఆర్థికంగా దెబ్బతీశాయి. గత మూడేళ్లుగా సంస్థ భారీ నష్టాలను చవిచూసింది. ముఖ్యంగా విమానాల్లోని ప్రాట్ అండ్ విట్నీ (Pratt & Whitney P&W) వరుసగా విఫలమవుతూ ఇబ్బంది పెట్టాయి. ప్రస్తుతం గో ఫస్ట్ విమానాల్లో సగానికి పైగా ఈ సమస్యతో షెడ్ కే పరిమితమయ్యాయి. ‘‘ప్రస్తుతం సంస్థకు రూ. 65.21 బిలియన్ల (798 మిలియన్ డాలర్లు) అప్పులున్నాయి. ప్రస్తుతం రుణాలను తీర్చే పరిస్థితిలో సంస్థ లేదు. అన్ని ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి’’ అని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (National Company Law Tribunal (NCLT) కి పెట్టుకున్న దివాళా పిటిషన్ లో గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ (Go First airlines) పేర్కొంది. ఏప్రిల్ చివరి నాటికి గో ఫస్ట్ వద్ద ఉన్న మొత్తం 54 ఎయిర్ బస్ 320 నియోస్ విమానాల్లోని P&W ఇంజిన్లు మరమ్మత్తుల్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఇంజిన్ మరమ్మత్తులకే గో ఫస్ట్ సంస్థకు రూ. 108 బిలియన్లు ఖర్చయ్యాయి. గత నెలలో 4,118 గో ఫస్ట్ విమాన ప్రయాణాలు రద్దయ్యాయి.