OTT Subscription Plans : రూ.200 కంటే తక్కువకే 15 ఓటీటీలు.. రూ.95కి కూడా ప్లాన్.. ఓ లుక్కేయండి
OTT Subscription Plans : టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (వీఐ) అనేక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో మీరు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ కూడా పొందవచ్చు. ఆ ప్లాన్స్ ఏంటో చూద్దాం..
పాపులర్ ఓటీటీ సర్వీసులను విడివిడిగా సబ్‌స్క్రైబ్ చేసుకుంటే బిల్లు తడిసిమోపెడు అవుతుంది. అదే ఒక్క రీఛార్జ్‌తో అనేక ఓటీటీ యాప్స్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ వస్తే బాగుంటుంది కదా. ఓటీటీ కంటెంట్‌ను యాక్సెస్ చేసుకునే ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తోపాటుగా వొడాఫోన్ ఐడియా (వీఐ) కూడా ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లు రూ .200 కంటే తక్కువ ఖర్చు అవుతాయి.
వీఐ రూ .95 ఓటిటి ప్లాన్
వొడాఫోన్ ఐడియా రూ .95 ప్లాన్ 14 రోజుల వాలిడిటీతో వస్తుంది. అయితే సోనీలైవ్ సబ్‌స్క్రిప్షన్ రీఛార్జ్‌పై 28 రోజులు లభిస్తుంది. దీనితో పాటు ఈ ప్లాన్ 4జీబీ అదనపు డేటా ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
వీఐ రూ .151 ఓటిటి ప్లాన్
రూ .151 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే వీఐ వినియోగదారులు 30 రోజుల పాటు 4జీబీ అదనపు డేటా ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా ఈ ప్లాన్ మొత్తం మూడు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాక్సెస్‌ను అందిస్తుంది.
వీఐ రూ.154 ఓటీటీ ప్లాన్
ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీతో 2 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా వీఐ మూవీస్, టీవీలకు లైట్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. జీ5, సోనీలివ్, సన్ ఎన్ ఎక్స్‌టీ, ఫ్యాన్ కోడ్ సహా 15కు పైగా ఓటీటీల కంటెంట్ ఇందులో ఉంది.
వీఐ రూ.169 ఓటీటీ ప్లాన్
మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 3 నెలల పాటు ఉచితంగా ఆస్వాదించాలనుకుంటే ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో వస్తుంది. 8జీబీ అదనపు డేటాను పొందుతుంది.
వీఐ రూ.175 ఓటీటీ ప్లాన్
వొడాఫోన్ ఐడియా సబ్‌స్ట్రైబర్స్ ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా 10 జీబీ అదనపు డేటా లభిస్తుంది. జీ5, సోనీలైవ్, ఫ్యాన్ కోడ్ వంటి 13కు పైగా ఓటీటీల కంటెంట్‌ను వీఐ మూవీస్, టీవీ యాప్‌తో వీక్షించే అవకాశం లభిస్తుంది.
ఈ ప్లాన్లన్నీ డేటా ఓన్లీ ప్లాన్స్ అని గుర్తుంచుకోవాలి. వీటి నుంచి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండవు. అలాగే యాక్టివ్ ప్లాన్‌లతో కలిపి రీఛార్జ్ చేసుకోవచ్చు.