Stocks to buy today : హెచ్​సీఎల్​ టెక్​, గ్రాసిమ్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ లాభాలు!-day trading guide for today 6 stocks to buy or sell on tuesday 31st january ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : హెచ్​సీఎల్​ టెక్​, గ్రాసిమ్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ లాభాలు!

Stocks to buy today : హెచ్​సీఎల్​ టెక్​, గ్రాసిమ్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ లాభాలు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 08, 2024 08:38 PM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​
నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ (AP)

Stocks to buy today : తీవ్ర ఒడుదొడుకల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 169 పాయింట్ల లాభంతో 59,500 లెవల్​ను టచ్​ చేసింది. నిఫ్టీ50.. 44 పాయింట్లు పెరిగి 17,648 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 40,378 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. బడ్జెట్​ 2023 సమీపిస్తున్న నేపథ్యంలో ట్రేడర్లు జాగ్రత్త వహించాలి.

India Stock market news : "ఫిబ్రవరి 1న బడ్జెట్​ ఉండనుంది. ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి. బడ్జెట్​ తర్వాత మార్కెట్​కు ఒక డైరక్షన్​ లభించే అవకాశం ఉంది. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో కీలక సపోర్ట్​ వద్దకు చేరిన నిఫ్టీ.. అక్కడి నుంచి పెరిగింది. అంటే.. బుల్స్​ తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాలతో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. దాదాపు 55 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

Budget 2023 live updates : అమెరికా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాలతో ముగించాయి. డౌ జోన్స్​ 0.7శాతం, ఎస్​ అండ్​ పీ 500 1.3శాతం, నాస్​డాక్​ 1.96శాతం మేర నష్టపోయాయి.

ఫెడ్​ సమావేశం సమీపిస్తుండటం, ఆసియాలో కీలక ఆర్థిక డేటాలు వెలువడనున్న నేపథ్యంలో.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అనేక ఏషియన్​ మార్కెట్​లు నష్టాల్లో ముగిశాయి. వారం రోజుల సెలవు అనంతరం తెరుచుకున్న చైనా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో స్థిరపడ్డాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు.. అమ్మకాల తీవ్రతను పెంచారు! సోమవారం ఒక్క రోజే రూ. 6,792.8కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5512.63కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

స్టాక్స్​ టు బై..

హెచ్​సీఎల్​ టెక్నాలజీస్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1105, టార్గెట్​ రూ. 1170- రూ. 1190

Grasim share price target : గ్రాసిమ్​ ఇండస్ట్రీస్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1560, టార్గెట్​ రూ. 1640- రూ. 1660

ఎన్​టీపీసీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 159, టార్గెట్​ రూ. 180

ఎస్​బీఐ కార్డ్స్​ అండ్​ పేమెంట్​ సర్వీసెస్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 688, టార్గెట్​ రూ. 760

Stock to buy list : ఇండస్​ టవర్స్​:- బై రూ. 148, స్టాప్​ లాస్​ రూ. 142, టార్గెట్​ రూ. 160

ఓఐఎల్​ (ఆయిల్​ ఇండియా లిమిటెడ్​):- బై రూ. 238, స్టాప్​ లాస్​ రూ. 232, టార్గెట్​ రూ. 245

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం