CMF Phone 1 : రూ. 16వేలకే సూపర్​ ఫీచర్స్- ఇండియాలో సీఎంఎఫ్​ ఫోన్​ 1 లాంచ్​..-cmf phone 1 cmf buds pro 2 and cmf watch pro 2 launched in india see price features and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Cmf Phone 1 : రూ. 16వేలకే సూపర్​ ఫీచర్స్- ఇండియాలో సీఎంఎఫ్​ ఫోన్​ 1 లాంచ్​..

CMF Phone 1 : రూ. 16వేలకే సూపర్​ ఫీచర్స్- ఇండియాలో సీఎంఎఫ్​ ఫోన్​ 1 లాంచ్​..

Sharath Chitturi HT Telugu
Jul 09, 2024 11:15 AM IST

CMF Phone 1 launch in India : ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ నథింగ్​కు చెందిన సీఎంఎఫ్​ నుంచి తొలి గ్యాడ్జెట్​ ఇండియాలో లాంచ్​ అయ్యింది. దీనితో పాటు వాచ్​ ప్రో 2, బడ్స్​ ప్రో 2ను కూడా ఇండియాలోకి తీసుకొచ్చింది. ఆ వివరాలు..

సీఎంఎఫ్​ ఫోన్​ 1. బడ్స్​ ప్రో 2, వాచ్​ ప్రో 2 లాంచ్​..
సీఎంఎఫ్​ ఫోన్​ 1. బడ్స్​ ప్రో 2, వాచ్​ ప్రో 2 లాంచ్​.. (CMF)

ఇండియా స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లోకి సరికొత్త గ్యాడ్జెట్​ ఎంట్రీ ఇచ్చింది. నథింగ్​ కంపెనీకి చెందిన సబ్​బ్రాండ్​ సీఎంఎఫ్​.. ఎట్టకేలకు తన తొలి స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది. దీని పేరు సీఎంఎఫ్​ ఫోన్​ 1. దీనితో పాటు సీఎంఎఫ్​ బడ్స్​ ప్రో 2, వాచ్​ ప్రో 2లను కూడా భారత మార్కెట్​లో లాంచ్​ చేసింది. కంపెనీ మొదటి తరం మిడ్-రేంజ్ స్మార్ట్​ఫోన్​ ఫోన్​ 1పై భారీ అంచనాలు ఉన్నాయి. మిడ్ రేంజ్ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​లో పోటీని ఈ గ్యాడ్జెట్​ మరింత పెంచింది! సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2, వాచ్ ప్రో 2 అనేక అప్​గ్రేడ్స్​, ఫీచర్లతో ఆవిష్కరించిన రెండొవ తరం గ్యాడ్జెట్స్​.

సీఎంఎఫ్ ఫోన్ 1, సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 పూర్తి వివరలను ఇక్కడ తెలుసుకోండి..

సీఎంఎఫ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

సీఎంఎఫ్ ఫోన్ 1 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్​తో 6.67 ఇంచ్​ సూపర్ అమోలెడ్​ డిస్​ప్లేని కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్​తో పనిచేసే ఈ స్మార్ట్​ఫోన్​.. యూజర్లకు వేగవంతమైన, సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఈ స్మార్ట్​ఫోన్​ డ్యూయెల్ కెమెరా సెటప్​తో వస్తుంది. ఇందులో సోనీ 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా డెడికేటెడ్ పోర్ట్రెయిట్ సెన్సార్ ఉంది. దీంతోపాటు 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించారు. సీఎంఎఫ్ ఫోన్ 1లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. నథింగ్ ఓఎస్ 2.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.ఫీచర్లతో పాటు కేస్, స్టాండ్, లాన్ యార్డ్, కార్డ్ కేస్ వంటి ప్రత్యేకమైన పర్సనలైజేషన్ అటాచ్​మెంట్లను కూడా సీఎంఎఫ్ అందిస్తోంది. అయితే ఈ యాక్సెసరీలను విడిగా కొనుగోలు చేయాలని గుర్తుపెట్టుకోవాలి.

సీఎంఎఫ్ వాచ్ ప్రో 2, బడ్స్ ప్రో 2 స్పెసిఫికేషన్లు..

సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 కూడా ఇంటర్ ఛేంజబుల్ బెజెల్​తో వినియోగదారులకు పర్సనలైజ్డ్ ఎక్స్​పీరియన్స్​ను అందిస్తోంది. ఈ స్మార్ట్​వాచ్ 1.32 ఇంచ్​ అమోలెడ్ ఆల్వేస్ ఆన్ డిస్​ప్లేతో వస్తుంది. ఇది 120 కి పైగా స్పోర్ట్స్ మోడ్లతో పాటు 5 స్పోర్ట్స్ ఆటోమేటిక్ గుర్తింపును అందిస్తుంది. ఇది హార్ట్​ రెస్పాన్స్​ రేటు, బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్​ (SpO₂), స్ట్రెస్​ లెవల్స్​ ట్రాకింగ్ వంటి ఫీచర్స్​ కూడా అందిస్తుంది.

మరోవైపు, సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 11 ఎంఎం బాస్ డ్రైవర్, 6 ఎంఎం ట్వీటర్ ఎల్​డీఏసీ టెక్నాలజీతోజతచేసిన హై-రెస్ ఆడియో, డైరాక్ ఆప్టియోను అందిస్తుంది. అదనంగా, ఇది 50 డెసిబుల్స్ వరకు హైబ్రిడ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,హెచ్​డీ మైక్లు, విండ్-నాయిస్ రిడక్షన్ 2.0, మరెన్నో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. బడ్స్ ప్రో 2 43 గంటల మొత్తం బ్యాటరీ లైఫ్, 7 గంటల ప్లేబ్యాక్ కోసం 10 నిమిషాల ఫాస్ట్​ ఛార్జ్​ను అందిస్తుందని సిఎంఎఫ్ పేర్కొంది.

సీఎంఎఫ్ ఫోన్ 1, సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2, సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 ధరలు..

సీఎంఎఫ్ ఫోన్ 1 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15999. సీఎంఎఫ్ వాచ్ ప్రో 2 ప్రారంభ ధర రూ.4,999 కాగా, సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2 ప్రారంభ ధర రూ.4,299. లాంచ్ చేసిన అన్ని డివైజ్​ల అధికారిక సేల్ జూలై 12 మధ్యాహ్నం 12 గంటలకు cmf.tech, రిటైల్ పార్ట్​నర్​ స్టోర్స్​లో ప్రారంభమవుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం