Best smartphones under 30000 : రూ. 30వేల బడ్జెట్లో ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!
Smartphones under 30000 : రూ.30,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్మీ, వన్‌ప్లస్, వివో వంటి టాప్ బ్రాండ్ల జాబితాను ఇక్కడ చూసేయండి..
Smartphones under ₹30000 : మీరు ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 30వేలు లేపు ఉంటుందా? అయితే.. ఇది మీకోసమే. ఇండియా మార్కెట్లో.. ప్రస్తుతం రూ. 30వేల బడ్జెట్లో అందుబాటులో ఉన్న ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని మీకోసం తెచ్చేశాము. ఆ వివరాలు..
రూ.30,000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- రియల్ మీ జీటీ 6టీ: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 ఇంచ్ 3డీ అమోఎల్ఈడీ డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. రియల్మీ జీటీ 6టీ స్మార్ట్‌ఫోన్‌లో 4ఎన్ఎం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్, ఆన్-డివైజ్ జనరేటివ్ ఏఐ సామర్థ్యాలు ఉన్నాయి. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ సోనీ లైట్-600 ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 సెల్ఫీ కెమెరాను అందించింది సంస్థ.
Poco F6 price in India : 2. పోకో ఎఫ్6: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 ఇంచ్ 1.5కే అమోఎల్ఈడీ డిస్ల్పే, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, ఈ 2400నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. కొత్త పోకో ఎఫ్6లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 12 LPDDR5X ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉన్నాయి. పోకో ఎఫ్6 డ్యూయెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఓఐఎస్, ఇఐఎస్ మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ముందువైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
3. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే వస్తుంది. క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 8 జీబీ LPDDR4X ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. నార్డ్ సీఈ 4లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ను అందించారు. 100వాట్ వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.
Vivo V30E price in India : 4. వివో వీ30ఈ: ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్, 1300 ఇంచ్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, అడ్రినో జీపీయూ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. 50 మెగాపిక్సెల్ ఐఏఎఫ్ సెల్ఫీ కెమెరాను కూడా ఇందులో అందించారు.
5. ఇన్ఫీనిక్స్ జీటీ 20 ప్రో: మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ ఎస్ఓసీతో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్.. 8 జీబీ, 12 జీబీ LPDDR5X ర్యామ్‌తో వస్తుంది. ఇది పిక్సెల్ వర్క్స్ ఎక్స్ 5 టర్బో గేమింగ్ చిప్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ బూస్ట్ గేమింగ్ మోడ్ ను అందిస్తుంది. ఇన్ఫీనిక్స్ జీటీ 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 6.78 ఇంచ్ ఎల్టీపీఎస్ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. 108 మెగాపిక్సెల్ మెయిన్ శాంసంగ్ హెచ్ఎం6 సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
సంబంధిత కథనం