Poco F6: భారత్ లో పోకో ఎఫ్6 సేల్స్ ప్రారంభం; ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి..
Poco F6 sales start: పోకో ఎఫ్6 స్మార్ట్ ఫోన్ సేల్ మే 29వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమయ్యాయి. ఈ పోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ లో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్ఓసీ, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వంటి ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి.
Poco F6 sales start: పోకో కొత్త పోకో ఎఫ్ 6 ను మే 23 న భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ రోజు అంటే మే 29వ తేదీ నుంచి అధికారికంగా అమ్మకాలను ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఫ్లిప్ కార్ట్ లో ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు.
ధర, లాంచ్ డే డీల్స్
సేల్ యొక్క మొదటి రోజున, అంటే, మే 29న ఈ పోకో ఎఫ్ 6 (Poco F6) స్మార్ట్ ఫోన్ కు ప్రత్యేక ఇంట్రడక్టరీ ప్రైస్ అందుబాటులో ఉంటుంది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999లకు లభిస్తుంది. ప్రముఖ బ్యాంకుల నుంచి క్రెడిట్, డెబిట్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొనుగోళ్లపై రూ.2000 డిస్కౌంట్, పాత స్మార్ట్ఫోన్లలో ట్రేడింగ్ చేసే కస్టమర్లకు అదనంగా రూ.2000 తగ్గింపు లభిస్తుంది. రేపటి నుంచి 8/256 జీబీ వేరియంట్ ధర రూ.29999, 12/256 జీబీ వేరియంట్ ధర రూ.31999, 12/512 జీబీ వేరియంట్ ధర రూ.33,999 లకు పెరగనుంది.
కీలక స్పెసిఫికేషన్లు
పోకో ఎఫ్6 (Poco F6) లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో, 1220×2712 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది 2,400 నిట్ల పీక్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ను ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ఇందులో స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ను అమర్చారు. పోకో ఎఫ్6లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. పోకో ఎఫ్6 లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90వాట్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ 1.0 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది.