Best smartphones under 10,000 : టాప్ 5 బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
Best smartphones under 10,000 : మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
Best smartphones under 10,000 : కొత్తగా ఒక స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్‌పై మీరు ఆసక్తిగా ఉన్నారా? అయితే.. ఇది మీకోసమే! ఇండియాలో అందుబాటులో ఉన్న టాప్ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ని ఇక్కడ చూడండి..
రూ. 10వేల బడ్జెట్లో టాప్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..
పోకో ఎం6 ప్రో 5జీ:- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.79 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ సైతం లభిస్తోంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్ఓసీ చిప్సెట్ దీని సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 సాఫ్ట్‌వేర్‌పై ఇది పనిచేస్తుంది.
పోకో ఎం6 ప్రో 5జీ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఉంటుంది, వీటిలో 50 ఎంపీ ఏఐ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లు ఉన్నాయి. ఫ్రెంట్లో 8 ఎంపీ కెమెరా వస్తుంది.
Best budget friendly smartphone : రెడ్మీ 13సీ:- ఈ రెడ్మీ స్మార్ట్‌ఫోన్‌లో 6.74 ఇంచ్ హెచ్డీ+ 600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జి 85 చిప్సెట్ వస్తోంది. 8 జీబీ వరకు ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ రెడ్మీ 13సీలో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2 ఎంపీ మాక్రో లెన్స్, మరో 2ఎంపీ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. కాగా.. సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 5ఎంపీ ఫ్రెంట్ కెమెరా వస్తోంది.
Realme C53 price : రియల్మీ సీ53:- ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో 6.74 ఇంచ్ 90 హెచ్‌జెడ్ డిస్ప్లే, 90.3 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 560 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. స్క్రీన్ 180 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేటును అందిస్తుంది. ఆక్టాకోర్ చిప్సెట్తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
రియల్మీ స్మర్ట్ఫోన్ రేర్‌లో 108ఎంపీతో కూడిన ట్రిపుల్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 8 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా లభిస్తోంది.
లావా బ్లేజ్ 5జీ:- లావా బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్లో 6.5 ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అంతేకాక, డిస్ప్లే ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్- వాటర్ డ్రాప్-నాచ్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ఓసీ ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. లావా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై పనిచేస్తుంది.
Top smartphones under 10,000 : సామ్సంగ్ గెలాక్సీ ఎం13:- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, 1080×2408 పిక్సెల్స్ రిజల్యూషన్ వంటివి ఉంటాయి. ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టెమ్ ఆధారిత వన్ యూఐ సాఫ్ట్‌పై వర్క్ చేస్తుంది. ఫ్రెంట్లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. రేర్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా లభిస్తోంది.
సంబంధిత కథనం
టాపిక్