Best 50-inch android TV: 40 వేల లోపు ధరలో బెస్ట్ ఆండ్రాయిడ్ టీవీలు ఇవే..-best 50 inch android tvs under 40 000 rupees buying guide ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Best 50-inch Android Tvs Under 40,000 Rupees: Buying Guide

Best 50-inch android TV: 40 వేల లోపు ధరలో బెస్ట్ ఆండ్రాయిడ్ టీవీలు ఇవే..

HT Telugu Desk HT Telugu
Dec 15, 2023 08:02 PM IST

50-inch android TVs: 40 వేల రూపాయల లోపు ధరలో అన్ని ఫీచర్స్ తో మంచి ఆండ్రాయిడ్ టీవీ కోసం చూస్తున్నారా? ఇక్కడ ఐదు బెస్ట్ మోడల్స్ మీ కోసం..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

50-inch android TVs: స్మార్ట్ టీవీల విప్లవం తరువాత ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అప్ డేటెడ్ స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. 40 వేల రూపాయల లోపు ధరలో అన్ని ఫీచర్స్ తో మంచి ఆండ్రాయిడ్ టీవీ కోసం చూస్తున్నట్లయితే, మీ కోసం ఈ ఆప్షన్స్..

ట్రెండింగ్ వార్తలు

OnePlus 126 cm: వన్ ప్లస్

OnePlus Y సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV. 4K అల్ట్రా HD రిజల్యూషన్ తో పిక్చర్ క్వాలిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. అత్యంత స్లీక్ డిజైన్ దీని ప్రత్యేకత. ఇందులో Android ఆపరేటింగ్ సిస్టమ్‌ ఉంటుంది. ఈ 50-అంగుళాల ఆండ్రాయిడ్ OnePlus 50Y1S ప్రో టీవీ లో అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి.

MI 125 cm: ఎంఐ

ఇది చైనా స్మార్ట్ డివైజెస్ బ్రాండ్ ఎంఐ నుంచి వచ్చిన 50 ఇంచ్ ల స్మార్ట్ టీవీ. ఇది బ్లాక్ ఎక్స్ సిరీస్ లో వచ్చిన 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో చాలా అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. ఈ టీవీ మోడల్ నంబర్ MI L50M7-A2IN.

TCL 126 cm: టీసీఎల్

ఇది 50 ఇంచ్ ల 4 కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ గూగుల్ టీవీ. మొత్తం బ్లాక్ కలర్ లో బెజిల్ లెస్ స్క్రీన్ తో, ఆకర్షణీయమైన డిజైన్ లో వస్తుంది. గూగుల్ టీవీ ద్వారా విస్తృతమైన ఎంటర్టైన్ మెంట్ అందుబాటులోకి వస్తుంది.

VU 126 cm: వీయూ

ఇది వీయూ గ్లో లెడ్ సిరీస్ 4 కే స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ. 4 కే క్వాలిటీతో వస్తుంది. గూగుల్ టీవీ ద్వారా విస్తృతమైన ఎంటర్టైన్ మెంట్ అందుబాటులోకి వస్తుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ డిజైన్ కాంబినేషన్ ఈ టీవీ ప్రత్యేకత. గ్లో లెడ్ టెక్నాలజీతో మరింత నాణ్యమైన పిక్చర్ క్వాలిటీ లభిస్తుంది. వాయిస్ కంట్రోల్ రిమోట్ తో వివిధ యాప్స్ ను ఈజీగా మార్చుకోవచ్చు.

Sony Bravia: సోనీ బ్రేవియా

ఇది ప్రముఖ బ్రాండ్ సోనీ నుంచి వచ్చిన అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ. దీని మోడల్ నంబర్ KD-50X64L (Black). స్లీక్, బ్లాక్ డిజైన్ తో, అత్యంత నాణ్యమైన పిక్చర్ క్వాలిటీతో చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. దీని 4 కే అల్ట్రా హెచ్ డీ డిస్ ప్లే స్పష్టమైన, ఆకర్షణీయమైన కలర్స్ ను చూపుతుంది. దీని వాయిస్ కంట్రోల్ రిమోట్, ఈజీ యూజర్ ఇంటర్ ఫేస్, అద్భుతమైన సౌండ్ క్వాలిటీ వీక్షకులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది.

WhatsApp channel