Benchmark IPO: మార్కెట్లోకి ఆకర్షణీయమైన జీఎంపీతో మరో ఎస్ఎంఈ ఐపీఓ; ఈ బెంచ్ మార్క్ ఐపీఓ కు అప్లై చేయొచ్చా?
Benchmark Computer Solutions IPO: బెంచ్‌మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్ IPO డిసెంబర్ 15, గురువారం సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయింది. ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు డిసెంబర్ 18, సోమవారం వరకు బిడ్డింగ్ చేసుకోవచ్చు.
Benchmark Computer Solutions IPO: స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజ్ (SME) కేటగిరీలో బెంచ్ మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్ ఐపీఓ డిసెంబర్ 15న ఓపెన్ అయింది. ఈ ఐపీఓకు డిసెంబర్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓ లాట్ సైజ్ 2000. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ. 66 గా నిర్ణయించారు.
బెంచ్‌మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్
బెంచ్‌మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్ లిమిటెడ్ (Benchmark Computer Solutions IPO) టెక్నాలజీ కన్సల్టింగ్, IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ను అందిస్తుంది. కంపెనీ కంప్లీట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ను, ఐటీ ఇన్ ఫ్రా సర్వీసెస్ ను అందిస్తుంది. ప్లాట్‌ఫారమ్-యాజ్-ఎ-సర్వీస్ (PaaS), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-ఎ-సర్వీస్ (IaaS) మరియు సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS)తో సహా అన్ని సర్వీస్ మోడల్‌లను ఈ కంపెనీ అందిస్తుంది. ఈ కంపెనీ సాఫ్ట్‌వేర్, వెబ్ ఆధారిత అప్లికేషన్‌లు, IT ఇన్ ఫ్రా - సొల్యూషన్స్, వార్షిక నిర్వహణ ఒప్పందాలు (AMC) మరియు ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (FMS) ను కూడా అందిస్తుంది. ట్రెడిషనల్, న్యూఏజ్ టెక్నాలజీల్లో ఈ కంపెనీ లోతైన డొమైన్ పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. మార్కెట్లో ఈ కంపెనీకి సిల్వర్ టచ్ టెక్నాలజీస్ లిమిటెడ్, డైనకాన్స్ సిస్టమ్స్ & సొల్యూషన్స్ లిమిటెడ్ లిస్టెడ్ సంస్థలు పోటీ దారులుగా ఉన్నాయి.
IPO details: ఐపీఓ వివరాలు..
ఈ ఐపీఓ ద్వారా బెంచ్‌మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్ లిమిటెడ్ రూ. 12.24 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా మొత్తం 1,854,000 ఈక్విటీ షేర్లను అమ్మకానికిి పెట్టింది. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, మూలధన వ్యయాల కోసం వెచ్చించనుంది.
subscription status, GMP: సబ్ స్క్రిప్షన్ స్టేటస్, జీఎంపీ
బెంచ్‌మార్క్ కంప్యూటర్ సొల్యూషన్స్ IPO సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ 2వ రోజున ఇప్పటివరకు 16.10 రెట్లుగా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 27.56 రెట్లు, ఎన్ఐఐ పోర్షన్ 4.66 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. అలాగే, బెంచ్‌మార్క్ IPO గ్రే మార్కెట్లో శుక్రవారం, డిసెంబర్ 15న రూ. 35 ప్రీమియం (GMP) తో ట్రేడ్ అవుతోంది.
సూచన: ఈ కథనం నిపుణుల అభిప్రాయాలతో రూపొందించినది. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో, పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవడం సముచితం.