Bajaj ethanol bike : క్లీన్​ ఎనర్జీపై బజాజ్​ ఫోకస్​.. త్వరలో ఇథనాల్​ బైక్​ లాంచ్​!-bajaj ethanol bike and three wheeler to be showcased in september ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Ethanol Bike : క్లీన్​ ఎనర్జీపై బజాజ్​ ఫోకస్​.. త్వరలో ఇథనాల్​ బైక్​ లాంచ్​!

Bajaj ethanol bike : క్లీన్​ ఎనర్జీపై బజాజ్​ ఫోకస్​.. త్వరలో ఇథనాల్​ బైక్​ లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Sep 01, 2024 06:40 AM IST

Bajaj ethanol bike : క్లీన్ ఎనర్జీ విభాగంలో అభివృద్ధిని ప్రోత్సహిస్తున్న బజాజ్ ఆటో వచ్చే నెలలో ఇథనాల్​ బైక్​తో పాటు ఇథనాల్​ త్రిచక్ర వాహనాన్ని ప్రదర్శించనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బజాజ్​ ఇథనాల్​ బైక్​!
బజాజ్​ ఇథనాల్​ బైక్​!

బజాజ్ ఆటో తన మొదటి ఇథనాల్ ఆధారిత ద్విచక్ర వాహనాన్ని వచ్చే నెలలో ప్రదర్శించనుంది. ఎండి రాజీవ్ బజాజ్ ఇటీవలే సీఎన్బీసీ-టీవీ 18తో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధృవీకరించారు. క్లీన్ ఎనర్జీ కేటగిరీ అభివృద్ధి వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో 2 వీలర్​తో పాటు 3 వీలర్​ ఇథనాల్​ వాహనాలను సంస్థ త్వరలోనే ప్రపంచానికి పరిచయం చేయనుంది.

త్వరలో బజాజ్ ఇథనాల్ బైక్​..

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇథనాల్​తో నడిచే బైక్​, త్రిచక్ర వాహనాలను విడుదల చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉందని బజాజ్ వెల్లడించింది. ఫ్రీడమ్ 125 తరువాత మరింత సరసమైన సీఎన్జీ బైక్స్​ని అభివృద్ధి చేస్తున్న ఇదే ఇంటర్వ్యూలో రాజీవ్ బజాజ్ కూడా ధృవీకరించారు. “రాబోయే సీఎన్జీ బైక్ 100-100 సీసీ ఆఫర్ అని మేము అంచనా వేస్తున్నాము. మరియు 2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి - మార్చి) వస్తుందని ధృవీకరిస్తున్నాను,” అని అన్నారు.

ఇది బజాజ్ ఆటో మొదటి ఇథనాల్ ద్విచక్ర వాహనం కాగా, ఇతర ద్విచక్ర వాహన సంస్థలు ఇప్పటికే కాన్సెప్ట్ లు లేదా ప్రోటోటైప్​లను ప్రదర్శించాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ 100 శాతం ఇథనాల్​తో నడిచే అపాచీ ఆర్టీఆర్200ను ఆవిష్కరించింది. ఈ20-ఈ85 ఇంధనాలతో నడిచే ఫ్లెక్స్ టెక్​తో కూడిన హోండా సీబీ300ఎఫ్​ను జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్​పో 2024లో సంస్థ ప్రదర్శించారు.

లాంచ్ ప్లాన్లు, ఇంధనం లభ్యతపై మరిన్ని వివరాలు వచ్చే నెలలో వెల్లడించే అవకాశం ఉంది. బజాజ్ తన ప్రస్తుత ఉత్పత్తులలో ఒకదాన్ని అప్డేట్ చేస్తుందా లేదా ఇథనాల్ ద్విచక్ర వాహనానికి సరికొత్త ఆఫర్​ని ప్రవేశపెడుతుందా అనేది చూడాలి.

ఈ20 అవసరాలకు అనుగుణంగా ఇంధన పంపులను అప్​గ్రేడ్ చేస్తున్నప్పటికీ ఇథనాల్ లభ్యత ఆందోళన కలిగిస్తోంది! 2023లో ప్రవేశపెట్టిన బీఎస్6 2.0 అప్డేట్ 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో సహా ఇంధన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ప్రస్తుత ఉత్పత్తి శ్రేణిని నవీకరించింది.

క్లీన్ ఎనర్జీ వెహికల్స్ నుంచి మరిన్ని సేల్స్..

ఈ పండుగ సీజన్​లో క్లీన్ ఎనర్జీ వెహికల్స్​తో నెలవారీ అమ్మకాల్లో 1,00,000 యూనిట్లను సాధించాలని చూస్తున్నట్లు రాజీవ్ బజాజ్ తెలిపారు. ఇందులో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, కొత్త ఫ్రీడమ్ 125 సీఎన్జీ ఉన్నాయి. చేతక్ శ్రేణిని విస్తరించడానికి కంపెనీ కృషి చేస్తోంది. తక్కువ, అధిక ధర పాయింట్ల వద్ద మరిన్ని వేరియంట్లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనం