Audi Q5 limited edition : లిమిటెడ్​ ఎడిషన్​ ఆడీ క్యూ5 లాంచ్​.. ధర ఎంతంటే!-audi q5 limited edition suv launched in india check price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Audi Q5 Limited Edition : లిమిటెడ్​ ఎడిషన్​ ఆడీ క్యూ5 లాంచ్​.. ధర ఎంతంటే!

Audi Q5 limited edition : లిమిటెడ్​ ఎడిషన్​ ఆడీ క్యూ5 లాంచ్​.. ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Sep 18, 2023 06:30 PM IST

Audi Q5 limited edition : ఆడీ క్యూ5 లిమిటెడ్​ ఎడిషన్​ ఎస్​యూవీ ఇండియాలో లాంచ్​ అయ్యింది. ఫీచర్స్​, ధర వివరాలివే..

లిమిటెడ్​ ఎడిషన్​ ఆడీ క్యూ5 లాంచ్​.. ధర ఎంతంటే!
లిమిటెడ్​ ఎడిషన్​ ఆడీ క్యూ5 లాంచ్​.. ధర ఎంతంటే!

Audi Q5 limited edition : లిమిటెడ్​ ఎడిషన్​ క్యూ5 ఎస్​యూవీని ఇండియాలో లాంచ్​ చేసింది దిగ్గజ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఆడీ. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ధర, ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

లిమిటెడ్​ ఎడిషన్​ విశేషాలు ఇవే..

ఇండియాలో ఆడీ క్యూ5 ఎస్​యూవీకి మంచి డిమాండ్​ ఉంది. ఇక లిమిటెడ్​ ఎడిషన్​ కూడా.. కస్టమర్లను ఆకర్షిస్తుందని సంస్థ భావిస్తోంది. క్యూ5 ఎస్​యూవీ టెక్నాలజీ వేరియంట్​లో ఈ లిమిటెడ్​ ఎడిషన్​ కారు వస్తోంది. మైథోస్​ బ్లాక్​ కలర్​ ఎక్స్​క్లూజివ్​గా లభిస్తోంది. ఒకాపీ బ్రౌన్​ రంగును కేబిన్​లో వినియోగించారు.

ఈ ఆడీ క్యూ5 లిమిటెడ్​ ఎడిషన్​ మోడల్​లో బ్లాక్​ స్టైలింగ్​ ప్యాకేజ్​ ప్లస్​, బ్లాక్​ ఆడీ రింగ్స్​, గ్రిల్​, రూఫ్​ రెయిల్స్​ వస్తున్నాయి. విండో ట్రిమ్​ స్ట్రిప్స్​ కూడా బ్లాక్​ కలర్​లో వస్తున్నాయి. ఈ మోడల్​లో వర్టికల్​ స్టట్స్​ డిజైన్​తో కూడిన సింగిల్​ ఫ్రేమ్​ గ్రిల్​, ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, పానారోమిక్​ సన్​రూఫ్​, కంఫర్ట్​ కీ, సెన్సార్​ కంట్రోల్డ్​ బూట్​ లిడ్​ ఆపరేషన్​ వంటివి లభిస్తున్నాయి.

ఇదీ చూడండి:- Tata Nexon vs Kia Seltos : 2023 టాటా నెక్సాన్​ వర్సెస్ కియా​ సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​- ఏది బెస్ట్​?

Audi Q5 limited edition price : ఇక ఆడీ క్యూ5 లిమిటెడ్​ ఎడిషన్​ కేబిన్​లో ప్లష్​ లెథర్​, లెథరేట్​ కంబైన్డ్​ అప్​హోలిస్ట్రీ, 8 ఎయిర్​బ్యాగ్స్​, పార్క్​ అసిస్ట్​, పవర్​ ఫ్రెంట్​ సీట్స్​ విత్​ డ్రైవర్​ మెమోరీ, 3 జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, 30 కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, ఆడీ ఫోన్​ బాక్స్​ విత్​ వయర్​లెస్​ ఫోన్​ ఛార్జింగ్​ వంటివి ఉంటాయి. ఇందులో 10 ఇంచ్​ మెయిన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, బీ అండ్​ ఓ ప్రీమియం సౌండ్​ సిస్టెమ్​, 19 స్పీకర్స్​, డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లేలు సైతం వస్తున్నాయి.

ఇక ఈ లిమిటెడ్​ ఎడిషన్​ ఆడీ క్యూ5 ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధర రూ. 69.72లక్షలు. పండుగ సీజన్​ సమీపిస్తున్న వేళ, ఎక్స్​క్లూజివ్​ ఫీలింగ్​ను కస్టమర్లు పొందొచ్చని, ఇందుకోసం ఈ లిమిటెడ్​ ఎడిషన్​ మంచి అవకాశమని దిగ్గజ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఆడీ ప్రచారం చేస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్