Anant Ambani engagement: అంబానీ వారసుడి ఎంగేజ్ మెంట్; అమ్మాయి ఎవరో తెలుసా?
Anant Ambani engagement: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ నిశ్చితార్థం(marriage engagement or Roka) గురువారం జరిగింది.
Anant Ambani engagement: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ నిశ్చితార్థం(marriage engagement or Roka ) గురువారం రాజస్తాన్ లోని నాథ్వారాలో ఉన్న శ్రీనాథ్ జీ ఆలయం (Shrinathji Temple) లో జరిగింది. గర్ల్ ఫ్రెండ్ రాధిక మర్చంట్ (Radhika Merchant) ను అనంత్ అంబానీ వివాహం చేసుకోనున్నారు. రాధిక మర్చంట్, అనంత్ అంబానీ (Anant Ambani)ల మధ్య చాన్నాళ్లుగా ప్రేమ కొనసాగుతోంది.
Anant Ambani engagement: ఎంగేజ్ మెంట్
రాజస్తాన్(Rajasthan) రాజధాని జైపూర్ కు 350కిమీల దూరంలోని నాథ్వారా లో ఉన్న శ్రీనాథ్ జీ ఆలయంలో(Shrinathji Temple) అనంత్ అంబానీ (Anant Ambani) నిశ్చితార్థ వేడుకలు జరిగాయి. శైల మర్చంట్, వీరేన్ మర్చంట్ ల కుమార్తె రాధిక మర్చంట్ (Radhika Merchant) తో అనంత్ అంబానీ (Anant Ambani) వివాహ నిశ్చితార్థం రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries Limited RIL) అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ నిశ్చితార్థం(marriage engagement or Roka ) గురువారం కుటుంబ సభ్యులు, కొందరు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఆలయంలో కాబోయే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి నిశ్చితార్ధం విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ పిరామల్ నాథ్వానీ ట్విటర్ లో వెల్లడించారు.
Mukesh ambani son Anant Ambani engagement: పెళ్లి ఎప్పుడు?
అయితే, అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చంట్ (Radhika Merchant) ల వివాహ వేడుకలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయనే విషయం ఇంకా తెలియలేదు. అనంత్ అంబానీ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. ఆ తరువాత వివిధ విభాగాల్లో వివిధ హోదాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పని చేశారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎనర్జీ డివిజన్ హెడ్ గా ఉన్నారు. రాధిక మర్చంట్ (Radhika Merchant) అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ప్రస్తుతం ఎన్ కోర్ హెల్త్ కేర్ కంపెనీలో బోర్ ఆఫ్ డైరెక్టర్ గా ఉన్నారు.