Twins to Isha Ambani: ఈశా అంబానీకి కవల పిల్లలు; తిరుమల పూజారులతో ప్రత్యేక పూజలు-mukesh ambani s daughter isha ambani arrives in mumbai special puja for her twins tomorrow ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Mukesh Ambani's Daughter Isha Ambani Arrives In Mumbai; Special Puja For Her Twins Tomorrow

Twins to Isha Ambani: ఈశా అంబానీకి కవల పిల్లలు; తిరుమల పూజారులతో ప్రత్యేక పూజలు

Sudarshan Vaddanam HT Telugu
Dec 24, 2022 11:14 PM IST

Twins to Isha Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాతయ్యారు. ముకేశ్ అంబానీ కూతురు ఈశా అంబానీ గత నెల కవల పిల్లలకు జన్మనిచ్చారు.

కవల పిల్లలతో ఈశా అంబానీ
కవల పిల్లలతో ఈశా అంబానీ (ANI)

Twins to Isha Ambani: ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ తాతగా కొత్త బాధ్యతలు చేపట్టారు. ముకేశ్ అంబానీ కూతురు ఈశా అంబానీ నవంబర్ 19న లాస్ ఏంజెలిస్ లో కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారిని తొలిసారి శనివారం భారత్ కు తీసుకువచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Twins to Isha Ambani: కవలలు.. ఒక పాప, ఒక బాబు

రిలయన్స్ రిటైల్ కు ఈశా అంబానీ డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త మరో ప్రముఖ పారిశ్రామిక వేత్తల కుటుంబమైన పిరామల్ కుటుంబ వారసుడు ఆనంద్ పిరామల్. ఆనంద్ పిరామల్ తల్లిదండ్రులు స్వాతి, అజయ్ పిరామల్. గత నెలలో అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఈశా అంబానీ కవల పిల్లలకు జన్మనిచ్చారు. వారిలో ఒకరు మగ పిల్లవాడు కాగా, మరొకరు అమ్మాయి. పాప పేరును ఆదియా అని, బాబు పేరును కృష్ణ అని పెట్టారు. శనివారం వారు తమ చిన్నారులతో కలిసి ముంబైలోని తమ నివాసమైన కరుణ సింధు కు చేరుకున్నారు. వారికి ఇరు కుటుంబాల పెద్దలు స్వాగతం పలికారు. మనవడు, మనవరాలిని చూసుకుని ముకేశ్ అంబానీ, నీతా అంబానీ మురిసిపోయారు.

Priests from Tirumala: ప్రత్యేక పూజల కోసం తిరుమల పూజారులు

ఈశా అంబానీ కవల పిల్లల కోసం డిసెంబర్ 25న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ పిల్లల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజలు చేయనున్నారని సమాచారం. అలాగే, ఈ పూజలను జరపడానికి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పూజారులు, ద్వారకాదీశ్ ఆలయానికి చెందిన పూజారులు వస్తున్నారని రిలయన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రత్యేక పూజల సందర్భంగా అంబానీ కుటుంబం 300 కేజీల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్లు సమాచారం.

Special arrangements for the kids: పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

కొత్త కుటుంబ సభ్యుల కోసం అంబానీ, పిరామల్ కుటుంబాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వారి నివాసాలైన ఆంటిలియా (Antilia), కరుణ సింధు(karuna Sindhu)ల్లో చిన్న పిల్లల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్స్ పెర్కిన్స్ అండ్ విల్ ఆధ్వర్యంలో సూర్యకాంతి నేరుగా తగిలేలా ఆటోమేటెడ్ రూఫ్ టాప్స్, అలాగే, రొటేటింగ్ బెడ్స్ ను ఏర్పటు చేశారు. పిల్లల కోసం ప్రత్యేకంగా లోరో పియానా(Loro Piana), హెర్మిస్(Hermes), డియోర్(Dior) డిజైన్డ్ ఫర్నిచర్ ను ఏర్పాటు చేశారు. వారి దుస్తులను ప్రత్యేకంగా డోల్స్ అండ్ గాబనా(Dolce & Gabbana), గుస్సీ(Gucci), లోరో పియానా(Loro Piana) ల నుంచి డిజైన్ చేసి తెప్పిస్తున్నారు. అంతేకాదు, వారి ప్రయాణాలకు వీలుగా బీఎండబ్ల్యూ(BMW) నుంచి ప్రత్యేక కారు సీట్లు వస్తున్నాయి.

8 trained Nurses from US: అమెరికా నుంచి స్పెషల్ నానీలు

అంతేకాదు, పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకు ఉండడం కోసం, అమెరికా నుంచి శిక్షణ పొందిన 8 మంది నానీలను కూడా తీసుకువచ్చారు. పిల్లలు పెద్దగా అయేంతవరకు వారు ఇండియాలోనే ఉంటారు. ఈశా అంబానీ, ఆనంద్ పిరామల్ లకు 2018లో వివాహమైంది. ఆనంద్ పిరామల్ గ్రూప్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

WhatsApp channel