Air India crew uniform: ఎయిర్ ఇండియా సిబ్బందికి మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన యూనిఫామ్-air india debuts manish malhotra designed uniform for cabin and cockpit crew ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Air India Crew Uniform: ఎయిర్ ఇండియా సిబ్బందికి మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన యూనిఫామ్

Air India crew uniform: ఎయిర్ ఇండియా సిబ్బందికి మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన యూనిఫామ్

HT Telugu Desk HT Telugu
Dec 13, 2023 10:43 AM IST

Air India crew uniform: క్యాబిన్, కాక్ పిట్ సిబ్బంది కోసం విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా లేటెస్ట్ డిజైన్ యూనిఫామ్ ను సిద్ధం చేసింది. ఈ యూనిఫామ్ ను ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేయడం విశేషం.

ఎయిర్ ఇండియా సిబ్బందికి కొత్త యూనిఫామ్
ఎయిర్ ఇండియా సిబ్బందికి కొత్త యూనిఫామ్

Air India crew uniform: తన క్యాబిన్, కాక్ పిట్ సిబ్బంది కోసం విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా లేటెస్ట్ డిజైన్ యూనిఫామ్ ను పరిచయం చేసింది. సినీ తారలకు, ఇతర సెలబ్రిటీలకు డ్రెసెస్ ను డిజైన్ చేసే ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఈ యూనిఫామ్ ను డిజైన్ చేయడం విశేషం.

దశల వారీగా..

తమ క్యాబిన్, కాక్ పిట్ సిబ్బంది కోసం రూపొందించిన కొత్త యూనిఫామ్ ను తమ విమానాల్లో దశలవారీగా పరిచయం చేస్తామని ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది. మొదట ఎయిర్ ఇండియా మొదటి ఎయిర్ బస్ ఏ 350 (Airbus A350) లో ఈ యూనిఫామ్ ను ఇంట్రడ్యూస్ చేస్తామని వెల్లడించింది.

సరికొత్త గుర్తింపు

ఎయిర్ ఇండియా సిబ్బంది యూనిఫామ్ కు విమానయాన పరిశ్రమలో మొదట్నుంచీ మంచి పేరు ఉందని, ఇప్పుడు ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన కొత్త యూనిఫామ్ ఆ ట్రెండ్ ను కొనసాగిస్తుందని ఎయిర్ ఇండియాలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్ బెల్ విల్సన్ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ఎయిర్ లైన్ నూతన గుర్తింపును ఈ సరికొత్త యూనిఫామ్ ప్రతిబింబిస్తుందన్నారు.

Whats_app_banner