Ajith Kumar racing team : సరికొత్త టీమ్‌తో రేసింగ్ ప్రపంచంలోకి అజిత్ కుమార్ రీఎంట్రీ
Ajith Kumar racing team : ప్రముఖ నటుడు అజిత్ కుమార్ రేసింగ్ ప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు అజిత్ కుమార్ రేసింగ్ టీమ్‌ని ప్రారంభించారు. అంతేకాదు పలు ఎంపిక చేసిన ఈవెంట్స్‌లో ఆయన సొంతంగా రేస్‌లో పాల్గొంటారు.
ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్‌కి రేసింగ్‌పై ఉన్న ప్రేమ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మాజీ ప్రొఫెషనల్ రేసర్.. మోటార్ స్పోర్ట్స్ ప్రపంచంలోకి తిరిగి ప్రవేశించనున్నారు. ఈ మేరకు తన సొంత రేసింగ్ టీమ్‌ని ప్రకటించారు. దీని పేరు అజిత్ కుమార్ రేసింగ్ టీమ్. దుబాయ్ ఆటోడ్రోమ్‌లో ఫెరారీ 488 ఈవో ఛాలెంజ్‌ని అజిత్ టెస్ట్ చేస్తున్న ఫోటోలను ఆయన మేనేజర్ సురేష్ చంద్ర ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు.
అజిత్ కుమార్ రేసింగ్ టీమ్..
అజిత్ కుమార్ రేసింగ్ అంతర్జాతీయంగా వివిధ మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొంటుంది. పోర్షే 992 జీటీ3 కప్ కేటగిరీలో 24హెచ్ సిరీస్ యూరోపియన్ సిరీస్‌తో ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఫ్రెంచ్ ప్రొఫెషనల్ డ్రైవర్ ఫాబియన్ డఫియక్స్ను జట్టు అధికారిక డ్రైవర్‌గా తీసుకుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్ని ఎంపిక చేసిన ఈవెంట్స్‌లో అజిత్ కుమార్ డ్రైవింగ్ సీట్ తీసుకుంటారని తెలుస్తోంది. టీమ్ ఓనర్‌గా, రేసర్‌గా అజిత్ ద్విపాత్రాభినయం అంతర్జాతీయ రేసింగ్ రంగంలో అరుదైన కలయిక అని ఆయన మేనేజర్ చంద్ర తెలిపారు.
అజిత్ మోటార్‌స్పోర్ట్ నేపథ్యం..
అజిత్ కుమార్ మోటార్‌స్పోర్ట్‌లో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నారు. గతంలో 2004 ఫార్ములా ఆసియా బీఎమ్‌డబ్ల్యూ ఎఫ్3 ఛాంపియన్షిప్, 2010 ఫార్ములా 2 ఛాంపియన్షిప్ సహా అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ నుంచి గణనీయమైన విరామం తరువాత ఆయన మళ్లీ తిరిగొస్తున్నారు.
కొత్తగా ఏర్పడిన బృందం యువ డ్రైవర్లకు నిర్మాణాత్మక రేసింగ్ ప్రోగ్రామ్ని అందించడం ద్వారా వారికి మద్దతు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుందని చంద్ర చెప్పారు. ఈ చొరవ అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్ రంగంలో మరింత మంది ప్రతిభావంతులను ప్రోత్సహించే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు.
రాబోయే సీజన్ కోసం టెస్టింగ్..
రాబోయే రేసింగ్ సీజన్‌కు సన్నాహకంగా అజిత్ ఇటీవల దుబాయ్ ఆటోడ్రోమ్‌లో ఫెరారీ 488 ఈవో ఛాలెంజ్‌ని టెస్ట్ చేశారు. రాబోయే యూరోపియన్ సీజన్ కోసం అజిత్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన కొత్త హెల్మెట్ డిజైన్ని హైలైట్ చేస్తూ మేనేజర్ మరిన్ని ఫొటలోలను సైతం పోస్ట్ చేశారు.
“రాబోయే యూరోపియన్ రేసింగ్ సీజన్ కోసం #AK సన్నద్ధమవుతున్నందున ఫెరారీ 488 ఈవో ఛాలెంజ్‌ని @Dubai_Autodrome లో టెస్ట్ చేయడం జరిగింది,” అని చంద్రా ట్వీట్ చేశారు. కొత్త హెల్మెట్ పెయింట్ స్కీమ్‌ను ఆవిష్కరించడానికి కూడా ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు.
రేసింగ్ టీమ్ కార్యకలాపాలు, అజిత్ కుమార్ ప్రమేయం గురించి మరిన్ని వివరాలు రాబోయే నెలల్లో ప్రకటించే అవకాశం ఉంది.
మూడున్నర కోట్లతో లగ్జరీ కారు..
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గ్యారేజీలోకి ఇటీవలే మరో లగ్జరీ కారు వచ్చి చేరింది. ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు, బైక్స్ కలెక్షన్ ఆయన దగ్గర ఉన్నాయి. వాటికి పోర్షె 911 జీటీ3 ఆర్ఎస్ కారు కూడా యాడ్ అయింది. ఈ కారు ధర ఏకంగా రూ.3.5 కోట్లు కావడం విశేషం. తన కొత్త కారుతో అజిత్ ఫొటోలకు పోజులివ్వగా వాటిని షాలిని షేర్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం