Acer Swift 3 OLED । 4K వీడియో స్ట్రీమింగ్ అందించే ఏసర్ సరికొత్త ల్యాప్‌టాప్!
ఏసర్ నుంచి భారత మార్కెట్లో Acer Swift 3 OLED అనే సరికొత్త ల్యాప్‌టాప్ విడుదల అయింది. ఇందులో ఎన్నో ఉత్తమ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర ఇతర వివరాలు చూడండి.
టెక్నాలజీ కంపెనీ ఏసర్ తాజాగా స్విఫ్ట్ లైనప్ నుండి Acer Swift 3 OLED అనే సరికొత్త ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త Acer ల్యాప్‌టాప్ సమర్థవంతమైన ఫీచర్లతో పాటు ఆకట్టుకునే డిజైన్‌ను కలిగి ఉంది. ఇది 12వ తరం ఇంటెల్ కోర్ i7/ కోర్ i5 ప్రాసెసర్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. గతంలో విడుదల చేసిన Acer Aspire 5 ల్యాప్‌టాప్‌లో ఇచ్చినట్లుగానే కోర్ i5 ప్రాసెసర్‌ను కొనసాగించింది. మల్టిపుల్ మోడ్ ఫంక్షనాలిటీతో ప్రొఫెషనల్ లేదా క్రియేటివ్ టాస్క్‌లు పూర్తిచేసుకోవటానికి అనుగుణంగా తమ ల్యాప్‌టాప్ ఉంటుందని ఏసర్ పేర్కొంది.
ఈ ల్యాప్‌టాప్‌లో Intel Alder Lake-H CPU అలాగే 1.4kg ఛాసిస్ ఉన్నాయి. అంతేకాదు ల్యాప్‌టాప్‌ను కేవలం 30-నిమిషాల ఛార్జ్‌తోనే 4 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిచగల సాంకేతకత ఉంది. ఇంకా ఈ PCలో ఆప్టిమైజ్ కూలింగ్ కోసం రెండు హీట్ పైపులు, ఎయిర్-ఇన్‌లెట్ కీబోర్డ్ ఉన్నాయి. ఇవి కంప్యూటర్ లోపలి భాగాన్ని చల్లగా ఉంచుతాయి. మెరుగైన పనితీరు కోసం Fn + Fతో ఫ్యాన్‌ని ట్యూన్ చేయవచ్చు.
Acer Swift 3 OLED 14-అంగుళాల, 2.8K డిస్‌ప్లేతో వస్తుంది. 4K వీడియోల స్ట్రీమింగ్, క్విక్ ఫైల్ షేరింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది టెంపోరల్ నాయిస్ రిడక్షన్ (TNR) టెక్నాలజీని కలిగి ఉన్న FHD ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది.
స్విఫ్ట్ 3 OLED ల్యాప్‌టాప్ ఏకైక స్టోరేజ్ కాన్ఫిగరేషన్లో అందుబాటులో ఉంటుంది. అయితే లగ్జరీ గోల్డ్, స్టీల్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.
ఇంకా ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత మొదలగు వివరాలను ఇక్కడ చూడండి.
Acer Swift 3 OLED ల్యాప్‌టాప్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 14 అంగుళాల HD OLED డిస్‌ప్లే
- 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- Intel కోర్ i7 12వ-తరం ప్రాసెసర్
- Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్
- FHD ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
- 4K వీడియో స్ట్రీమింగ్
కనెక్టివిటీ కోసం Wi-Fi 6E కనెక్టివిటీ, HDMI 2.1, USB4 , బ్లూటూత్ 5.2 ఉన్నాయి.
- ధర, రూ. 89,999/-
Acer Swift 3 OLED ల్యాప్‌టాప్ Acer వెబ్‌సైట్ , ఏసర్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, అమెజాన్, క్రోమా- విజయ్ సేల్స్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం