Royal Enfield Classic 350 : అప్డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎలా ఉండబోతోంది? లాంచ్ రేపే..
2025 Royal Enfield Classic 350 : రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బ్రాండ్‌కు బెస్ట్ సెల్లర్! ఇప్పుడు దీనికి అప్డేటెడ్ వర్షెన్ రాబోతోంది. ఎప్పుడు లాంచ్ అంటే..
రాయల్ ఎన్ఫీల్డ్ తన క్లాసిక్ 350 బైర్ని ఆగస్టు 12, 2024 న విడుదల చేయనుంది. కొత్త క్లాసిక్ 350లో పలు కీలక అప్డేట్స్ కనిపిస్తాయని సమాచారం. ప్రత్యర్థులకు మరింత పోటీనిచ్చే విధంగా మోడల్‌ను మరింత సముచితంగా ఉంచడానికి అనేక అట్రాక్టివ్ ఫీచర్ మార్పులతో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వస్తుందని తెలుస్తోంది. గత నెలలో బ్రాండ్ వాల్యూమ్స్‌లో ఎనిమిది శాతం క్షీణతను చూసినందున, అమ్మకాలు పెంచుకునేందుకు పండుగ సీజన్‌కి ముందు ఈ అప్డేట్ని సంస్థ తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో 2025 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350పై ఇప్పటివరుక ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
2025 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350..
అప్డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో అదే డిజైన్ ఉండనుంది. కానీ సూక్ష్మమైన స్టైలింగ్ మార్పులను పొందొచ్చు. కొత్త పెయింట్ ఆప్షన్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ సహా సవరించిన ఫీచర్ల జాబితా బయటకు రావొచ్చు. మోడ్రన్ క్లాసిక్ మోటార్ సైకిల్ టాప్ వేరియంట్లలో చాలా కొత్త ఫీచర్లతో సవరించిన వేరియంట్ లైనప్్ను పొందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరింత సమాచారంతో అప్‌గ్రేడ్ కూడా పొందొచ్చు. ఈ మోడల్ తన తాజా అవతారంలో డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి వివరాలను పొందవచ్చు. అంతేకాక, టాప్-ఎండ్ క్లాసిక్ 350లోని ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ ప్రస్తుత మోడల్ కంటే మరింత సమర్థవంతంగా పనిచేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తోంది సంస్థ.
2025 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్పెసిఫికేషన్లు
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మెకానికల్స్‌లో పెద్ద మార్పులను ఆశించవద్దు. ఈ అప్డేటెడ్ బైక్ జే-సిరీస్ 349 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 6,100 ఆర్పీఎమ్ వద్ద 20.2 బీహెచ్పీ పవర్, 4,000 ఆర్పీఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ ముందు భాగంలో 41 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్కులతో కూడిన ట్విన్ డౌన్‌ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్, వెనుక భాగంలో 6-స్టెప్స్ ప్రీలోడ్ అడ్జెస్టిబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. బ్రేకింగ్ పనితీరు 300 మిమీ ఫ్రెంట్ డిస్క్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్‌తో 270 ఎంఎం రేర్ డిస్క్, వెనుక భాగంలో 153 మిమీ డ్రమ్ బ్రేక్‌తో బేస్ ట్రిమ్స్‌లో సింగిల్-ఛానల్ ఏబిఎస్ ఆప్షన్‌ను కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అందిస్తుంది.
కొత్త క్లాసిక్ 350 19-ఇంచ్ ఫ్రెంట్, 18-ఇంచ్ రేర్ స్పోక్డ్ వీల్స్‌తో కొనసాగుతుందని ఆశించవచ్చు. అయితే తయారీదారు అల్లాయ్ వీల్ వేరియంట్లను అప్డేట్ చేయొచ్చు.
2025 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధర ఎంత ఉంటుంది?
ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ధర రూ .1.93 లక్షల నుంచి రూ .2.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. తాజా మోడల్‌తో ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. హీరో మావ్రిక్ 440, హార్లీ డేవిడ్సన్ ఎక్స్440, ట్రయంఫ్ స్పీడ్ 400, బెనెల్లీ ఇంపీరియల్ 400 వంటి బైక్స్ 350-500 సిసి సెగ్మెంట్లో క్లాసిక్ 350కి గట్టిపోటీనిస్తున్నాయి.
మరి ఈ అప్డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లవర్స్‌ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం