Pulsar NS160 vs Apache RTR 160 4V : పల్సర్​ ఎన్​ఎస్​160, అపాచీ ఆర్​టీఆర్​ 160 4వీలో ఏది బెస్ట్​?-2023 bajaj pulsar ns160 vs tvs apache rtr 160 4v see price and other specifications ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Pulsar Ns160 Vs Apache Rtr 160 4v : పల్సర్​ ఎన్​ఎస్​160, అపాచీ ఆర్​టీఆర్​ 160 4వీలో ఏది బెస్ట్​?

Pulsar NS160 vs Apache RTR 160 4V : పల్సర్​ ఎన్​ఎస్​160, అపాచీ ఆర్​టీఆర్​ 160 4వీలో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Mar 27, 2023 01:11 PM IST

2023 Bajaj Pulsar NS160 vs TVS Apache RTR 160 4V : బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​160, అపాచీ అర్​టీఆర్​ 160 4వీలో బెస్ట్​ ఏది? ఏది కొనొచ్చు? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఈ రెండు బైక్స్​ ఏది బెస్ట్​?
ఈ రెండు బైక్స్​ ఏది బెస్ట్​? (HT AUTO)

2023 Bajaj Pulsar NS160 vs TVS Apache RTR 160 4V : 2023 బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​160​, టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 200 బైక్స్​కు మార్కెట్​లో మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ రెండింటిని పోల్చి.. ఏది బెటర్​ అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

2023 బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​160 వర్సెస్​ టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 160 4వీ- లుక్స్​..

2023 Bajaj Pulsar NS160 on road price in Hyderabad : పల్సర్​ ఎన్​ఎస్​160 డిజైన్​ను బజాజ్​ సంస్థ మార్చలేదు. ఇంకా ఇది అగ్రెసివ్​ నేక్​డ్​ స్ట్రీట్​ఫైటర్​ డిజైన్​గానే ఉంది. అయితే 2023 ఎన్​ఎస్​160 మోడల్​ను ఇబోనీ బ్లాక్​ పెయింట్​ స్కీమ్​లోనూ విక్రయిస్తున్నారు.

మరోవైపు టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 160 4వీలోనూ నేక్​డ్​ స్ట్రీట్​ఫైటర్​ డిజైన్​ వస్తోంది. పల్సర్​తో పోల్చుకుంటే మాత్రం.. లుక్స్​ అంత అగ్రెసివ్​గా ఉండవు.

2023 బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​160 వర్సెస్​ టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 160 4వీ- ఇంజిన్​..

బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​160లోని ఇంజిన్​ 17.02 బీహెచ్​పీ పవర్​ను 14.6 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. మరోవైపు టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 160 4వీలోని ఇంజిన్​ 17.31 బీహెచ్​పీ పవర్​ను, 14.73 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. కాగా.. అర్బన్​, రెయిన్​ మోడ్స్​లో అపాచీ బైక్​ 15.42 బీహెచ్​పీ పవర్​ను, 14.14 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

TVS Apache RTR 160 4V price : ఈ రెండు బైక్స్​లోనూ ఆయిల్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. పైగా రెండిట్లోనూ 5 స్పీడ్​ గేర్​బాక్స్​ లభిస్తోంది.

2023 బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​160 వర్సెస్​ టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 160 4వీ- ఫీచర్స్​..

2023 Bajaj Pulsar NS160 price : పల్సర్​లోని సెమీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​లో డిస్టెన్స్​-టు- ఎంప్టీ రీడౌట్​ ఉండటం హైలైట్​. దీనితో పాటు ఫ్యూయెల్​ ఎకానమీ, గేర్​ పొజిషన్​ ఇండికేటర్​, యావరేజ్​ ఫ్యూయెల్​ ఎకనామీ ఇండికేటర్స్​ కూడా ఉంటాయి. హెడ్​ల్యాంప్​, టర్న్​ ఇండికేటర్స్​కు హ్యాలోజెన్​ యూనిట్స్​ వస్తున్నాయి. డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ కూడా అందుబాటులో ఉంది.

ఇక టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 160 4వీలో ఎల్​ఈడీ లైటింగ్​, రైడింగ్​ మోడ్స్​, సింగిల్​ ఛానెల్​ ఏబీఎస్​, గ్లైడ్​ థ్రూ టెక్నాలజీ, ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, బ్లూటూత్​ కనెక్టివిటీ, ఫెథర్​ టచ్​ స్టార్ట్​ ఆప్షన్స్​ వస్తున్నాయి.

2023 బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​160 వర్సెస్​ టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​ 160 4వీ- ధర..

TVS Apache RTR 160 4V on road price in Hyderabad : బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​160 ఎక్స్​షోరూం ధర రూ. 1.35లక్షలుగా ఉంది.. టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​160 4వీ ఎక్స్​షోరూం ధర రూ. 1.23లక్షలు- రూ. 1.45లక్షల మధ్యలో ఉంటుంది.