Ysrcp MLA : అమరావతి రైతుల పాదయాత్రపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు…-ysrcp mla ganesh warns amaravati farmers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp Mla : అమరావతి రైతుల పాదయాత్రపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు…

Ysrcp MLA : అమరావతి రైతుల పాదయాత్రపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు…

HT Telugu Desk HT Telugu
Sep 25, 2022 09:11 AM IST

Ysrcp MLA ఉత్తరాంధ్రలో అలజడి సృష్టించడానికే అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర పేరుతో దండెత్తుతున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. అరసవిల్లి సూర్యనారాయణుడ్ని దర్శించుకోవాలంటే నేరుగా వెళ్లాలని హెచ్చరించారు.

గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర
గుడివాడలో అమరావతి రైతుల పాదయాత్ర

Ysrcp MLA అమరావతి రైతుల మహా పాదయాత్ర రాజకీయ విమర్శలకు దారి తీస్తోంది. అమరావతి నుంచి అరసవిల్లి వరకు రైతులు చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడలో సాగుతోంది. శనివారం మొత్తం గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గుడివాడలో రైతుల పాదయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ ఘాటుగా స్పందించారు.

ఉత్తరాంధ్రలో అలజడి సృష్టించడానికే అమరావతి ప్రాంత రైతులు అరసవల్లికి పాదయాత్రగా వస్తున్నారని, వారిని అడ్డుకుంటామని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే Ysrcp MLA పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ చెప్పారు.

అమరావతి రైతులతో పాటు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అండగా వస్తే, అక్కడే తొక్కేస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు. నర్సీపట్నంలో వీడియో ప్రకటన ఎమ్మెల్యే విడుదల చేశారు. అరసవల్లి సూర్యభగవానుడి దర్శనానికి వెళ్లాలంటే బస్సులోనో, కారులోనో, రైల్లోనో నేరుగా వెళ్లాలని సూచించారు.

అరసవిల్లి పాదయాత్రగా ఎందుకు వస్తున్నారని, గొడవలు సృష్టించి ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే సహించమని హెచ్చరించారు. ఎన్టీఆర్‌ తెలుగు వారి గుండెల్లో ఉన్నది నిజమే. కానీ ఆయన గురించి మాట్లాడే హక్కు అయ్యన్నకు లేదన్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే వ్యాఖ్యలు దుమారం రేపాయి.

మరోవైపు అమరావతి రైతుల మహాపాదయాత్ర గుడివాడలో కొనసాగుతోంది. నేడు కూడా గుడివాడ మీదుగా అమరావతి రైతుల పాదయాత్ర ముందుకు సాగనుంది. పోలీసుల ఆంక్షల మధ్యే అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతులకు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండడంతో ఇతర ప్రాంతాల నేతలను రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు.

గుడివాడ పట్టణంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా దాదాపు 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడివాడ పట్టణంలో పోలీసుల ఆంక్షలు ఉన్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. ''600 మందితో యాత్ర చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రైతులను కూడా హైకోర్టు ఆదేశాలను పాటించాలని కోరారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పోలీసు ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్