Sri Vani Darshan : తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోనే శ్రీవాణి దర్శన టిక్కెట్లు…..-sri vani darshan tickets now available at tirupathi airport ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sri Vani Darshan : తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోనే శ్రీవాణి దర్శన టిక్కెట్లు…..

Sri Vani Darshan : తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోనే శ్రీవాణి దర్శన టిక్కెట్లు…..

HT Telugu Desk HT Telugu
Dec 17, 2022 08:01 AM IST

Sri Vani Darshan తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లను తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే మంజూరు చేస్తున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన టిక్కెట్ల జారీ కౌంటర్‌ను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు.

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టిక్కెట్లు
తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టిక్కెట్లు (svbc)

Sri Vani Darshan తిరుపతి ఎయిర్పోర్టులో శ్రీవాణి దర్శనం టికెట్ల కౌంటర్‌ను జేఈవో వీరబ్రహ్మం ప్రారంభించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లను ఇకపై తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే మంజూరు చేస్తారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్‌ను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు.

శ్రీవాణి ట్రస్టుకు రూ 10 వేలు విరాళం ఇచ్చి టికెట్ కోసం రూ. 500 చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేసేవారు. దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఇకపై తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే శ్రీవాణి టికెట్లు జారీ చేయనున్నారు.

ఇప్పటికే తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎయిర్పోర్ట్ ,తిరుపతిలోని మాధవం గెస్ట్ హౌస్ లో శ్రీ వాణి టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల దాతలు ముందు రోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. గతంలో ఉన్న ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించిన టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి మాధవంలో వారికి వసతి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు.

కొత్త విధానం వల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఏర్పాటు చేసిన కౌంటర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది. కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు యాజమాన్యానికి జేఈవో కృతజ్ఞతలు తెలిపారు.

ధనుర్మాస పూజలు ప్రారంభం….

నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాస పూజలు ప్రారంభం అయ్యాయి. సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై‍తో స్వామివారికి మేల్కోలుపుతారు. జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవను టీటీడీ రద్దు చేసింది. రాత్రి ఏకాంత సేవను భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామి వారికి నిర్వహించనున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం ఒక కంపార్ట్ మెంట్‍లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న 48,929 మంది దర్శించుకున్నారు. 23,322 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.61 కోట్లు లభించింది.

IPL_Entry_Point

టాపిక్