AP IIIT List: ట్రిపుల్ ఐటీల్లో ఎంపికైన విద్యార్ధుల జాబితాలు విడుదల, చెక్‌ చేసుకోండి ఇలా..-list of selected students in triple its released check like this ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Iiit List: ట్రిపుల్ ఐటీల్లో ఎంపికైన విద్యార్ధుల జాబితాలు విడుదల, చెక్‌ చేసుకోండి ఇలా..

AP IIIT List: ట్రిపుల్ ఐటీల్లో ఎంపికైన విద్యార్ధుల జాబితాలు విడుదల, చెక్‌ చేసుకోండి ఇలా..

HT Telugu Desk HT Telugu
Jul 12, 2024 09:00 AM IST

AP IIIT List: ఏపీలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాల‌యం (ఆర్జీయూకేటీ) ప‌రిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఇంజ‌నీరింగ్ కోర్సుల‌కు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుద‌లైంది.

ఏపీ ట్రిపుల్ ఐటీ జాబితాలు విడుదల
ఏపీ ట్రిపుల్ ఐటీ జాబితాలు విడుదల

AP IIIT List: ఏపీలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసిన వారిలో ఎంపికైన విద్యార్ధుల జాబితాలను నూజివీడు ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స‌ల‌ర్‌ కెసి రెడ్డి విడుద‌ల చేశారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల నుంచే 93 శాతం మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. మిగిలిన ఏడు శాతం ప్రైవేటు పాఠ‌శాల‌ల నుంచి విద్యార్థులు ఎంపిక అయ్యారు. అయితే ఎన్‌సీసీ, పీహెచ్‌, స్పోర్ట్స్ కోటా ఎంపిక‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.

రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌ల్లో సీట్లు 67.15 శాతం బాలిక‌లు, 32.85 శాతం బాలురు ఎంపిక అయ్యారు. రాష్ట్ర విద్యార్థులుకు 98 శాతం సీట్లు ద‌క్క‌గా, తెలంగాణ‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల విద్యార్థుల‌కు మిగిలిన రెండు శాతం సీట్లు ద‌క్కాయి.

ఈనెల 22 నుంచి 27 వ‌ర‌కు ఆయా ట్రిపుల్ ఐటీల్లో కౌన్సిలింగ్‌లు జ‌రుగుతాయ‌ని వైస్ చాన్స‌ల‌ర్ కెసి రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఒక్కొ ట్రిపుల్ ఐటీకి 1,100 సీట్లు చొప్పున‌, నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4,400 సీట్లు ఉన్నాయి. వీటికి 53,863 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

ఏఏ తేదీల్లో ఎక్క‌డెక్క‌డ కౌన్సిలింగ్

నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఈనెల 22, 23 తేదీల్లో కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నుంది. ట్రిపుల్ ఐటీ ఒంగోలు క్యాంపస్‌లో ఈనెల 24, 25 తేదీల్లో కౌన్సిలింగ్ జ‌రుగుతుంది. శ్రీ‌కాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌లో ఈనెల 26, 27 తేదీల్లో కౌన్సిలింగ్ జ‌రుగుతుంది. ఆయా క్యాంప‌స్‌ల్లో ఎంపికైన అభ్య‌ర్థుల స‌ర్టిఫికేట్లు ప‌రిశీలిస్తారు. ఆగ‌స్టు మొద‌టి వారం నుండి నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌ల్లో త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయి. ఇత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.rgukt.in/ ను సంప్ర‌దించాలి.

కాల్ లెట‌ర్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

కాల్ లెట‌ర్‌ను యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్‌కు వెళ్లిన‌ప్పుడు కాల్ లెట‌ర్ త‌ప్ప‌ని స‌రిగా తీసుకెళ్లాలి.

కాల్ లెట‌ర్ డౌన్‌లోడ్‌కు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ ఇదే https://admissions24.rgukt.in/ind/Phase1CLs ఈ లింక్‌ను క్లిక్ చేస్తే, అప్లికేష‌న్ నెంబ‌ర్‌, ప‌దో త‌ర‌గ‌తి హాల్ టికెట్టు నెంబ‌ర్‌, పుట్టిన తేదీ అడుగుతోంది. వాటిని ఎంట‌ర్ చేసి స‌బ్మిట్ బ‌ట‌న్ క్లిక్ చేస్తే కాల్ లెట‌ర్ ఓపెన్ అవుతుంది.

ఏపీఆర్‌జీయూకేటీ ఫేజ్‌-1 శ్రీ‌కాకుళం క్యాంప‌స్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితా డైరెక్ట్ లింక్ ఇదే…

ఏపీఆర్‌జీయూకేటీ ఫేజ్‌-1 నూజివీడు క్యాంప‌స్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితా డైరెక్ట్ లింక్ ఇదే https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/RGUKT-Nuzvid.pdf

ఏపీఆర్‌జీయూకేటీ ఫేజ్‌-1 ఇడుపుల‌పాయ‌ క్యాంప‌స్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితా డైరెక్ట్ లింక్ ఇదే

ఏపీఆర్‌జీయూకేటీ ఫేజ్‌-1 ఒంగోలు క్యాంప‌స్‌కు ఎంపికైన విద్యార్థుల జాబితా డైరెక్ట్ లింక్ ఇదే

ఏపీఆర్‌జీయూకేటీ ఫేజ్‌-1 గ్లోబ‌ల్ కేట‌గిరీ కింద ఎంపికైన విద్యార్థుల జాబితా డైరెక్ట్ లింక్ ఇదే

కోర్సులు

పీయూసీ-బీటెక్ రెండు కోర్సుల్లో బ్రాంచ్‌లు ఉంటాయి. రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్ క‌లిపి మొత్తం ఆరేళ్లు ట్రిపుల్ ఐటీలో విద్యాను అభ్య‌సించ‌వ‌చ్చు. పీయూసీ ఎంపీసీ, బైపీసీ కోర్సుల‌తో స‌మానంగా మేథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, లైఫ్ సైన్స్ ప్ర‌త్యేక కోర్సులు ఉంటాయి. బీటెక్‌లో కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, సివిల్ ఇంజ‌నీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజ‌నీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెట‌ల‌ర్జిక‌ల్ ఇంజ‌నీరింగ్‌, మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌ బ్రాంచ్‌లు ఉంటాయి.

ఫీజు వివరాలు…

ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థుల‌కు ఫీజులు ఇలా ఉంటాయి. పీయూసీకి ట్యూష‌న్ ఫీజు ఒక్కో ఏడాదికి రూ.45 వేలు ఉంటుంది. బీటెక్ విద్య‌కు ఏడాదికి ట్యూష‌న్ ఫీజు రూ.50 వేలు ఉంటుంది. ఇత‌ర రాష్ట్రాల అభ్య‌ర్థుల‌కు ఏడాదికి ట్యూష‌న్ ఫీజు రూ.1.50 ల‌క్ష‌లు ఉంటుంది.

ఇత‌ర స‌మాచారం కోసం, సందేహాలు నివృత్తి కోసం సంప్ర‌దించండి

Helpline Numbers for queries other than online application payment

Please write an email to admissions@rgukt.in

Please provide the following details in email : Your RGUKT Application Number, Name, SSC Hall Ticket Number, Mobile Number, and a brief outline of your problem.

For admission related queries, you can also call RGUKT Helpline No.s:

Timings: From 10:00 AM to 1:00 PM and 2:00 PM to 5:00 PM (On working days only)

Ph.No: 97035 42597

Ph.No: 97054 72597

(రిపోర్టింగ్ జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

సంబంధిత కథనం